‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ ట్రైలర్ లాంచ్
యంగ్ హీరో నరేష్ అగస్త్య, దర్శకుడు విపిన్ దర్శకత్వంలో, సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఉమా దేవి కోట నిర్మించిన మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా 'మేఘాలు చెప్పిన ప్రేమ కథ'లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. చిత్రంలో రబియా ఖతూన్ కథానాయిక. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు టీజర్లు, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ చిత్రం ఆగస్ట్ 22న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ట్రైలర్ మీ అందరికీ నచ్చిడం ఆనందంగా వుంది. ఆగస్టు 22న సినిమా రిలీజ్ అవుతుంది. నిర్మాత ఉమా గారికి…