‘అనగనగా ఒక రాజు’ చిత్రం సంక్రాంతి పండుగలా ఉంటుంది: నవీన్ పొలిశెట్టి
తెలుగు ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలతో నిండిన పండుగ సినిమా 'అనగనగా ఒక రాజు' : నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న అసలు సిసలైన పండుగ సినిమా 'అనగనగా ఒక రాజు'. మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. మొదటి నుంచి ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ…
