విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ సినిమాని తెలుగులో రీలీజ్ చేయనున్న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి, శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్
డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో విజయ్ ఆంటోనీ ఎప్పుడూ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉంటారు. ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయే మైలురాయి లాంటి చిత్రాల్లో ‘బిచ్చగాడు’ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. దర్శకుడు శశితో ‘బిచ్చగాడు’ తరువాత మళ్లీ విజయ్ ఆంటోని చేసిన చిత్రం ‘వంద దేవుళ్ళు’. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పించిన ఈ మూవీని సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజనేయులు జవ్వాజీ నిర్మించారు. మానవ సంబంధాలు, ఊహించని మలుపులు, ఆకట్టుకునే డ్రామాతో అందరినీ ఆకట్టుకునేలా ఈ సినిమాని రూపొందించారు. బ్లాక్‌బస్టర్ చిత్రాలను పంపిణీచేస్తూ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి, శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఈ రెండు బ్యానర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో…
