‘శ్రీ శ్రీ’ నుంచి రిఫ్రెషింగ్ రొమాంటిక్ రైడ్ ‘బొమ్మ బొమ్మ’ సాంగ్ రిలీజ్
వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ఎంటర్‌టైనర్ శ్రీ శ్రీ బిజీగా ఉన్నారు. ప్రతిష్టాత్మక ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, నిర్మాణ సంస్థకు 10వ (#SLV10) మైల్ స్టోన్ చిత్రంగా నిలుస్తోంది. ఇషాన్ సక్సేనా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే తొలిసారి జంటగా నటిస్తున్న ఈ సినిమా ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి స్పందన అందుకోగా, తాజాగా ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ తొలి పాట 'బొమ్మ బొమ్మ'ను మేకర్స్…
