ఫిఫా వరల్డ్ కప్ 2026… ప్యానెల్ లిస్ట్ అలర్ట్
- ఫిఫా వరల్డ్ కప్ 2026 కోసం భారతదేశంలో ప్రధాన ప్లాట్‌ఫారమ్‌గా ZEE5..ఎక్స్‌పర్ట్ ప్యానెల్‌లో ఇండియన్ ఫుట్‌బాల్ దిగ్గజం భైచుంగ్ భూటియా ZEE5 తన ప్లాట్‌ఫారమ్‌లో చక్కటి, ఉన్నతమైన నాణ్యతతో స్ట్రీమింగ్ చేస్తూ, లక్షలాది అభిమానులకు ఫిఫా ఫుట్ బాల్ మ్యాచ్‌లను చక్కగా ఎంజాయ్ చేస్తూ, గొప్ప అనుభవాన్ని అందించటానికి సిద్ధమైంది. ప్రేక్షకులను చేరుకోవటంలో ఉండే విస్తృతమైన అనుభవం, అధునిక డిజిటల్ సాంకేతికతో జూన్ 11 నుంచి జీ5 లైవ్ మ్యాచ్‌లు, హైలైట్స్‌తో పాటు మ్యాచ్‌లకు సంబంధించిన స్పెషల్ కంటెంట్‌ను కూడా అందించనుంది. దీంతో ప్రేక్షకులు పలు డివైజ్‌ల ద్వారా ఫుట్ బాల్ మహోత్సవంలోని ప్రతీ క్షణాన్ని ఆస్వాదించగలుగుతారు. ఫిఫాతో ఏర్పడిన ఈ భాగస్వామ్యంతో జీ5 తన క్రీడా విభాగాన్ని మరింత బలపరుచుకుంది…
