దర్శకుడు క్రిష్ జగర్లమూడి ఆవిష్కరించిన ‘వాలీ’ టైటిల్ మోషన్ పోస్టర్
ఫైర్‌వాటర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ స్పోర్ట్స్ డ్రామా 'వాలి' ఫస్ట్‌లుక్ అండ్ మోషన్ పోస్టర్‌కు అనూహ్య స్పందన టాలీవుడ్‌లో మొట్టమొదటి వాలీబాల్ నేపథ్యంలోని స్పోర్ట్స్ డ్రామా ‘వాలీ’ (VOLLEY) తన టైటిల్‌ను ఆసక్తికరమైన మోషన్ పోస్టర్ ద్వారా అధికారికంగా విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ జగర్లమూడి తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా విడుదల చేయగా, సినీ అభిమానులు మరియు పరిశ్రమ వర్గాల్లో మంచి స్పందన లభిస్తోంది. జి విక్రమ్ రెడ్డి సమర్పణలో ఫైర్‌వాటర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి దిలీప్ కె. మనుకొండ దర్శకత్వం వహిస్తున్నారు. తీరప్రాంత గ్రామీణ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా, ఇద్దరు అన్నదమ్ముల జీవితాలను కేంద్రీకరించి, వాలీబాల్ క్రీడలోని తీవ్ర పోటీ,…
