టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్
దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “నాగబంధం” పాన్-ఇండియా స్థాయిలో భారీ సంచలనం సృష్టిస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ మిస్టికల్ ఎపిక్ టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. కేవలం 24 గంటల్లోనే 20 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించి, దేశవ్యాప్తంగా ట్రెండింగ్ చార్ట్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకోవడం ద్వారా పాన్-ఇండియన్ లో అదరగొట్టింది. ఈ అచీవ్మెంట్ ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టేది డైరెక్టర్ అభిషేక్ నామా విజన్. అంతర్జాతీయ స్థాయి విజువల్ స్పెక్టకిల్‌ను అందించారు. ఆయనతో పాటు హీరో విరాట్ కర్ణా, డెబ్యుటెంట్ నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి కలిసి వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. టీజర్‌లో ప్రత్యేక హైలెట్ గా నిలిచింది విరాట్ కర్ణా…
