Skip to content

‘దండోరా’ మూవీ నుంచి ల‌వ్ సాంగ్ ‘పిల్లా..’ లిరిక‌ల్ వీడియో విడుద‌ల‌

ఓ అబ్బాయి అమ్మాయిని ప్రేమించ‌టం క‌ష్టం కాక‌పోవ‌చ్చు.. కానీ ఆ అమ్మాయి నుంచి ప్రేమ సిగ్న‌ల్ అందుకోవాలంటే మాత్రం నానా తిప్ప‌లు ప‌డాల్సిందే. ఐ ల‌వ్ యు చెప్పిన త‌ర్వాత ప్రేయ‌సి ఏమంటుందోన‌ని ప‌డే టెన్ష‌న్ మామూలుగా ఉండ‌దు. ఇలాంటి స‌మ‌యంలో ప్రేమికుడికి ప్రేయ‌సి ఓకే చెప్పేస్తే.. ఎలా ఉంటుంది.. అత‌ని మ‌న‌సు ఎలా ఊయ‌ల ఊగుతుంది. ఇద్ద‌రు క‌లిసి ఎవ‌రికీ తెలియ‌కుండా క‌ళ్ల‌తో మాట్లాడుకునే మాట‌లు, సైగ‌లు చూడ‌చ‌క్క‌గా ఉంటాయి. ఇంత‌కీ ప్రేమికులు ప‌య‌నం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మాత్రం ‘దండోరా’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ…

Read more

నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కీలక పాత్రలలో నటించిన “సఃకుటుంబానాం” చిత్ర ట్రైలర్ లాంచ్ చేసిన ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సనా

హెచ్ ఎన్ జి సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఉదయ్ శర్మ రచన దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సఃకుటుంబానాం. రామ్ చరణ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలకపాత్రలో పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా మధు దాసరి డిఓపిగా పనిచేశారు. ఎడిటర్ గా శశాంక్ మలి చేశారు. విడుదల తేదీ దగ్గరవుతున్న సందర్భంగా ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సనా చేతుల మీదగా సఃకుటుంబానాం చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్…

Read more

సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్న మణిశర్మ

జైశ్నవ్ ప్రొడక్షన్ , మాహాతేజ క్రియేషన్స్ లో అద్భుతం, టేనంట్ వంటి అద్బుతమైన చిత్రాలని నిర్మించిన మొగుళ్ళ చంద్రశేఖర్ గారి నిర్మాణంలో... క్రికెట్ నేపధ్యం లోనే కామెడీ ప్రధాన అంశంగా సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రధారులుగా మూవీ G.O.A.T . ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకి చేరుకుంది. ఇటివలే రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ఒడియమ్మ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లియోన్ జేమ్స్ ఈ పాటని అదిరిపోయే లవ్ మెలోడీ గా కంపోజ్ చేశారు. సుధీర్ బాబు కెరీర్‌లో ఇంత వేగంగా వైరల్ అయిన పాట ఇదే అనే చెప్పాలి. రిలీజ్ అయిన ఒక్క రోజులోనే రికార్డు స్థాయి…

Read more

మోగ్లీ’ అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుంది – దర్శకుడు సందీప్ రాజ్

జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ మూవీని టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు సందీప్ రాజ్ మీడియాతో ముచ్చటించారు. సినిమా గురించి ఆయన చెప్పిన విశేషాలివే.. ప్రస్తుతం మీరు నటుడిగా ఎక్కువ కనిపిస్తున్నారు? మీకు డైరెక్షన్, యాక్టింగ్‌లో ఏదంటే ఎక్కువ ఇంట్రెస్ట్? నాకు ముందుగా నటన అంటేనే ఇష్టం. ‘చాయ్ బిస్కెట్’లో ఉన్నప్పుడు కథలు కూడా రాసేవాడ్ని. అలా ‘అతిథి’ అనే షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ తరువాత దర్శకుడిగా నాకు అవకాశాలు స్టార్ట్ అయ్యాయి. అడ్వాన్స్‌లు…

Read more

‘అఖండ’ కంటే ‘అఖండ తాండవం’లో ఎక్కువ హై మూమెంట్స్ ఉంటాయి – ఆది పినిశెట్టి

గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మీద ఎం తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ మూవీని డిసెంబర్ 5న విడుదల చేయబోతోన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా అభిమానుల్లో, ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు విలక్షణ నటుడు ఆది పినిశెట్టి మీడియాతో ముచ్చటించారు. ఆయన ఈ చిత్రం గురించి చెప్పిన సంగతులివే.. బోయపాటి శ్రీను గారితో రెండో సారి పని చేస్తున్నారు కదా? ఏం తేడా గమనించారు? బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో నేను ‘సరైనోడు’…

Read more

“తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ ఫస్ట్ సింగిల్ ‘చిన్ని చిన్ని గుండెలోన’ రిలీజ్

ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ఆశపడే ఔత్సాహిక నటీనటుల, సాంకేతిక నిపుణులకు అండగా నిలబడుతూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". సుమైరా స్టూడియోస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'చిన్ని చిన్ని గుండెలోన' రిలీజ్…

Read more

స్వర్ణోత్సవానికి సిద్ధమవుతున్న ‘సోగ్గాడు’

నటభూషణ శోభన్ బాబు నటించిన 'సోగ్గాడు' చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ కలెక్షన్లను హోరెత్తించి...అనేక రికార్డులను సొంతం చేసుకుంది. పల్లెటూరు నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం తర్వాత 'సోగ్గాడు' శోభన్ బాబు అని పిలవడం మొదలు పెట్టారు. శోభన్ బాబు, జయచిత్ర, జయసుధ నాయకానాయికలుగా కె.బాపయ్య దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రం నాటి ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుని అజరామరంగా నిలిచింది. 1975 డిసెంబర్ 19న విడుదలైన ఈ చిత్రం సరిగ్గా ఈ ఏడాది డిసెంబర్ 19 నాటికి 50 ఏళ్లు పూర్తిచేసుకుని స్వర్ణోత్సవం జరుపుకోనున్నది. ఈ నేపథ్యంలో సురేష్ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి సంయుక్తంగా శ్రేయాస్ మీడియా సౌజన్యంతో డిసెంబర్ 19 తేదీన హైదరాబాద్…

Read more

రామ్ చరణ్ ‘పెద్ది’ పోరాట సన్నివేశాల చిత్రీకరణ

రామ్ చరణ్ ‘పెద్ది’ పోరాట సన్నివేశాల చిత్రీకరణ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’పై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్‌కు, ‘చికిరి’ పాటకు వచ్చిన అద్భుతమైన స్పందన గురించి అందరికీ తెలిసిందే. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మాత.. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్న ‘పెద్ది’ని భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ‘పెద్ది’ బృందం రామ్ చరణ్, ఇతర ఫైటర్లతో పాటు కీలకమైన, హై-ఇంటెన్సిటీ ఫైట్…

Read more

‘డిస్కవర్ ఆంధ్ర’ టైటిల్, గ్లింప్స్ విడుదల

ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో నవదీప్ పల్లపొలి, సాయి దుర్గ తేజ్ సారథ్యంలో శ్రీకాంత్ మన్నెపురి ‘డిస్కవర్ ఆంధ్ర’ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఈ ప్రాజెక్ట్‌ని పడాల సురేందర్ రెడ్డి, శ్రావ్య కూనం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ టైటిల్, గ్లింప్స్ లాంఛ్‌ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ .. ‘శ్రీకాంత్ కోసం ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఆంధ్రను ఇంత అద్భుతంగా చూపిస్తున్న శ్రీకాంత్ గారికి థాంక్స్. మన చుట్టూనే ఇన్ని అద్భుతాలు ఉన్నాయా? అని అందరూ ఆశ్చర్యపోతారు. 2020లో నాకు ఈ వైల్డ్ లైఫ్ గురించి ఎక్కువగా ఆలోచనలు వచ్చాయి. అందుకే ‘గ్రీన్ పాస్’ అనే…

Read more

రాయలసీమ భరత్ హీరోగా తెరకెక్కిన ‘జగన్నాథ్’ డిసెంబర్ 19న గ్రాండ్ రిలీజ్

భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద పీలం పురుషోత్తం నిర్మాణంలో భరత్, సంతోష్ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘జగన్నాథ్’. ఈ మూవీలో రాయలసీమ భరత్ హీరోగా, నిత్యశ్రీ, ప్రీతి, సారా హీరోయిన్లుగా నటిస్తున్నారు. భరత్ హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా చేస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ మీద చిత్రయూనిట్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ‘జగన్నాథ్’ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు జనాల్లో క్యూరియాసిటీని పెంచేశాయి. ఆల్రెడీ హీరో భరత్ జనాల్లోకి వెళ్లి సినిమాను డిఫరెంట్‌గా ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్‌లను రిలీజ్ చేశారు. డిసెంబర్ 19న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇందుకోసం రిలీజ్ చేసిన…

Read more