‘వంద దేవుళ్ళు’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల
విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి నిర్మించిన చిత్రం ‘వంద దేవుళ్ళు’. ఈ మూవీని జూన్ 19న విడుదల చేయబోతోన్నారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పాటలు, పోస్టర్లు ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ‘ఈ లోకంలో ప్రాణాలతో పుట్టిన అందరికీ కనీస…
