Skip to content

“చెన్నై లవ్ స్టోరీ” ఆడియో హక్కులను సొంతం చేసుకున్న టీ సిరీస్ సౌత్ మ్యూజిక్ లేబుల్

“చెన్నై లవ్ స్టోరీ” ఆడియో హక్కులను సొంతం చేసుకున్న టీ సిరీస్ సౌత్ మ్యూజిక్ లేబుల్ Telugu News

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా “కలర్ ఫొటో”, “బేబి” వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న “చెన్నై లవ్ స్టోరీ” సినిమాకు బిజినెస్ పరంగా మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన “చెన్నై లవ్ స్టోరీ” సినిమా గ్లింప్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడవడం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న “చెన్నై లవ్ స్టోరీ” సినిమా ఆడియో హక్కులను టీ సిరీస్ సౌత్ మ్యూజిక్ లేబుల్ సొంతం చేసుకుంది. మిడ్ రేంజ్ చిత్రాల్లో మరే సినిమాకు లేనంత ఫ్యాన్సీ రేట్ కు టీ సిరీస్ సౌత్ ఈ చిత్ర ఆడియో రైట్స్ దక్కించుకుంది.

బేబి సినిమా బాక్సాఫీస్ వద్ద కల్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో పాటు రెండు నేషనల్ అవార్డ్స్ దక్కించుకుంది, అలాగే కలర్ ఫొటో మూవీ నేషనల్ అవార్డ్ గెల్చుకుంది. మరోవైపు హీరో కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ మూవీ బిగ్ కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ కాంబోలో వస్తున్న చిత్రంగా “చెన్నై లవ్ స్టోరీ” ట్రేడ్ వర్గాలను ఆకర్షిస్తోంది. ఈ సినిమాకు బిజినెస్ క్రేజ్ కూడా బాగా ఏర్పడుతోంది.

ప్రస్తుతం “చెన్నై లవ్ స్టోరీ” మూవీ చిత్రీకరణ తుది దశలో ఉంది. ఈ వారంలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు మెలొడీ బ్రహ్మ మణిశర్మ కంపోజ్ చేసిన ఛాట్ బస్టర్ సాంగ్స్ ను మ్యూజిక్ లవర్స్ త్వరలోనే ఎంజాయ్ చేయబోతున్నారు.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్ డిజైనర్ – దేవి పర్చూరి
ఆర్ట్ – భాస్కర్ ముదావత్
ఎడిటర్ – సంతోష్ నాయుడు
డీవోపీ – విశ్వాస్ డేనియల్
లిరిక్స్ – అనంత్ శ్రీరామ్
మ్యూజిక్ డైరెక్టర్ – మణిశర్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విశాల దాట్ల
లైన్ ప్రొడ్యూసర్ -శ్యామ్ ప్రసాద్ మేక
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), వంశీ కాకా
మార్కెటింగ్ – హౌస్ ఫుల్
కో ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
స్టోరీ – సాయి రాజేశ్
నిర్మాతలు – ఎస్ కేఎన్, సాయి రాజేశ్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – రవి నంబూరి

See also  'మిస్టర్ మిడిల్ క్లాస్' అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది: హీరో శ్రీకాంత్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.