Skip to content

‘గాయపడ్డ సింహం’ నుంచి స్వీకర్ అగస్తీ, రాపర్ అసుర సెటైరికల్ రాప్ సాంగ్ రిలీజ్

‘గాయపడ్డ సింహం’ నుంచి స్వీకర్ అగస్తీ, రాపర్ అసుర సెటైరికల్ రాప్ సాంగ్ రిలీజ్ Telugu News

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇటివల విడుదలైన ఫన్ ఫిల్డ్ ట్రైజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాకు సంబంధించిన ఫన్ ప్రమోషనల్ ర్యాప్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట సినిమా సాటైరికల్ టోన్‌ను అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది.

ఈ పాట హీరో అమెరికన్ డ్రీమ్ ఎలా ఒక్కసారిగా తలకిందులవుతుందో చూపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన డిపోర్టేషన్ నిర్ణయం తర్వాత హీరో జీవితంలో ఏర్పడే గందరగోళ పరిస్థితులను సరదాగా చూపించారు.

ట్రెండీ బీట్స్‌తో రూపొందిన ఈ ర్యాప్ సాంగ్‌ను సంగీత దర్శకుడు స్వీకర్ అగస్తీ స్వయంగా ఆలపించగా, ర్యాప్ పార్ట్స్ అసుర పాడారు. సాహిత్యాన్ని కూడా స్వీకర్ అగస్తి రాయగా, అసురా ర్యాప్ వర్సెస్ అందించారు. పాస్‌పోర్ట్‌పై పడే రిజెక్షన్ స్టాంపులు, ట్రంప్ విగ్రహాలు, “హ్యాపీ డిపోర్టేషన్” కేక్ కట్టింగ్ వంటి సరదా సన్నివేశాలతో పాట వినోదాత్మకంగా సాగుతుంది.

వీడియోలో ఎనర్జీతో నిండిన డ్యాన్స్ మూమెంట్స్, సరదా విజువల్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. తరుణ్ భాస్కర్ తన డెడ్‌పాన్ హ్యూమర్‌తో నవ్వులు పండించగా, విష్ణు ఓయి బడ్డీ వైబ్‌ను తీసుకొచ్చారు. టైటిల్‌కు తగినట్లు ఒక సింహం కూడా విజువల్‌గా కనిపిస్తూ కథలోని “గాయపడ్ద సింహం” ను సూచిస్తుంది. స్వీకర్ అగస్తి, అసురా కూడా వీడియోలో కనిపిస్తూ ఫన్ మరింత పెంచారు.

ఈ చిత్రంలో మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా కథానాయికలు కాగా, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

విద్యా సాగర్ చింతా సినిమాటోగ్రఫీ, విప్లవ్ నైషదం ఎడిటింగ్‌న, చంద్రిక గొర్రెపాటి ప్రొడక్షన్ డిజైన్‌, సూర్య ప్రకాష్ జ్యోసుల కథను అందిస్తున్నారు.

ఈ చిత్రం2026 వేసవిలో థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, తదితరులు

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కాశ్యప్ శ్రీనివాస్
సమర్పణ: పవన్ సాదినేని
నిర్మాతలు: కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్
బ్యానర్లు: సప్తస్వ మీడియా వర్క్స్, POV స్టోరీస్, జీ స్టూడియోస్
DoP: విద్యా సాగర్ చింత
సంగీతం: స్వీకర్ అగస్తీ
ఎడిటర్: విప్లవ్ నిషాదం
ప్రొడక్షన్ డిజైనర్: చంద్రిక గొర్రెపాటి
కథ: సూర్య ప్రకాష్ జ్యోసుల
కాస్ట్యూమ్ డిజైనర్: అపూర్వ రెడ్డి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రీని జోస్యుల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పెన్మత్స అజయ్ వర్మ
PRO: వంశీ-శేఖర్
డిజిటల్ మీడియా: హ్యాష్‌ట్యాగ్ మీడియా
సౌండ్ డిజైన్: సింక్ సినిమాస్
Vfx & టైటిల్ యానిమేషన్: ఎగ్ వైట్
పబ్లిసిటీ డిజైన్: ఎల్లోటూత్స్

See also  'ధురంధర్ ది రివెంజ్' ట్రైలర్ మార్చి 7 ఉదయం 11:01 గంటలకు రిలీజ్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.