Skip to content

‘మా ఇంటి బంగారం’లో సెన్సేష‌న‌ల్ రెస్పాన్స్‌తో ట్రెండింగ్ అవుతోన్న ‘త‌స్సాదియ్యా’ సాంగ్‌

‘మా ఇంటి బంగారం’లో సెన్సేష‌న‌ల్ రెస్పాన్స్‌తో ట్రెండింగ్ అవుతోన్న ‘త‌స్సాదియ్యా’ సాంగ్‌ Telugu News

ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న సెకండ్ ప్రాజెక్ట్ ‘మా ఇంటి బంగారం’. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం మే 15న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ వేస‌విలో రిలీజ‌వుతోన్న చిత్రాల్లో ఈ యాక్ష‌న్ డ్రామా కోసం అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌తో సినిమాపై చాలా మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

ఈ సినిమా ప్రమోష‌న్స్‌లో భాగంగా ముందుగా మ్యూజిక‌ల్ ప్ర‌మోష‌న్స్‌కు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా రీసెంట్‌గా ‘త‌స్సాదియ్యా’ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న‌ల్‌గా మారింది. నెట్టింట ఎక్క‌డ చూసినా వైర‌ల్ అవుతోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో 20 వేల‌కు పైగా రీల్స్‌లో ఈ సాంగ్ ట్రెండ్ అవుతోంది. అలాగే యూ ట్యూబ్‌, షార్ట్ వీడియోస్‌లోనూ సాంగ్ అంద‌రినీ అల‌రిస్తూ సాంగ్ ట్రెండ్ అవుతూ టాప్ రేంజ్‌లో దూసుకెళ్తోంది.

ఈ సెల‌బ్రేష‌న్ సాంగ్‌ను ప‌ర్‌ఫెక్ట్‌గా సంతోష్ నారాయ‌ణ‌న్ కంపోజ్ చేశౄరు. సాంగ్ బీట్‌, లిరిక్స్‌, కొరియోగ్ర‌ఫీ అన్నీ ప‌క్కాగా కుదిరాయి. అందుక‌నే సాంగ్‌ను చూస్తున్నంత సేపు ఫెస్టివ‌ల్ ఫీల్ క‌లుగుతోంది. దీంతో సాంగ్‌కు ఆడియెన్స్ నుంచి సెన్సేష‌న‌ల్ రెస్పాన్స్ వ‌స్తోంది. దీంతో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు టీమ్ కొత్త ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీతో సినిమాపై అంచ‌నాల‌ను పెంచ‌టానికి సిద్ధ‌మ‌వుతోంది.

రీసెంట్‌గా చిత్ర యూనిట్ సమంత‌ను వెన్నెల కిషోర్ విడుద‌ల చేసిన వీడియోకు సంబంధించిన క్లిప్స్ వైర‌ల్ అవుతున్నాయి. దీంతో “మా ఇంటి బంగారం” మూవీపై మంచి హైప్ క్రియేట్ అవుతోంది. ఎమోషనల్ టచ్‌తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్‌ని, రోమాలు నిక్క‌బొడుచుకునేలా ఉండే యాక్షన్ సీన్స్ క‌ల‌గ‌లిసి గ్రిప్పింగ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది.

సమంత ఈ సినిమాలో కేవలం లీడ్ రోల్‌లో న‌టించ‌ట‌మే కాదు.. రాజ్ నిడిమోరు, హిమాంక్‌ దువ్వూరుతో కలిసి ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమీ, ఆనంద్, లక్ష్మీ, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష త‌దితరులు ఇత‌ర పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు.