Skip to content

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో Telugu News
విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో Telugu News
విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో Telugu News

సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ సినిమాగా ఆర్.బి. చౌదరి నిర్మానంలో విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘మకుటం’. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్, పోస్టర్లు చూస్తే ఇదొక డిఫరెంట్ యాక్షన్ సినిమా అని అర్థం అవుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు. విశాల్, అంజలి కాంబోకి ఉన్న హిట్స్, క్రేజ్ అందరికీ తెలిసిందే. అయితే ఈ ‘మకుటం’ చిత్రంలోనూ విశాల్ సరసన అంజలి నటించనున్నారు. ఈ మేరకు అంజలి, విశాల్ కలిసి ఓ కాన్సెప్ట్ వీడియోని చేశారు.

హీరోయిన్ అంజలి వద్దకు దర్శకుడైన విశాల్ కథ చెప్పడానికి వెళ్తాడు. ఇక కథ చెప్పండి డైరెక్టర్ గారు అని అంజలి అంటారు. ఒక అందమైన గ్రామం అని విశాల్ అంటే.. అది ప్రొడక్షన్ వాళ్లు చూసుకుంటారు కదా.. ముందు మీరు కథ చెప్పండని కౌంటర్ వేస్తారు అంజలి. ఇలా విశాల్ కథ చెబుతూ ఉంటే మధ్య మధ్యలో అంజలి సెటైర్లు వేస్తుంటారు. విశాల్ ఇలా ఏదేదో చెబుతుంటారు.. అసలు మీ వద్ద కథ ఉందా? అని అంజలి అడగడంతో విశాల్ పారిపోతారు. మంచి కథ అని మేనేజర్ చెప్పారే.. విశాల్ ఏంటి ఇలా చెబుతున్నారని అంజలి అనుకుంటారు. కథ అడుగుతోందే.. ఎలా.. రేపు వచ్చి మరో కథ చెబుదాం అని విశాల్ వెళ్లిపోతారు.

ఈ కాన్సెప్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్‌ బాధ్యతల్ని విశాల్ చూసుకుంటున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.