Skip to content

మైసా’ కోసం బ్యాంకాక్‌లో రోజూ 8 గంటల శిక్షణ తీసుకుంటున్న రష్మిక మందన్న

మైసా’ కోసం బ్యాంకాక్‌లో రోజూ 8 గంటల శిక్షణ తీసుకుంటున్న రష్మిక మందన్న Telugu News
మైసా’ కోసం బ్యాంకాక్‌లో రోజూ 8 గంటల శిక్షణ తీసుకుంటున్న రష్మిక మందన్న Telugu News

నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’తో తన కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడిన దశలోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఇంటెన్స్ గ్లింప్స్‌తో మంచి బజ్ సృష్టించగా, ఇప్పుడు రష్మిక ఆఫ్ స్క్రీన్ డెడికేషన్ అంచనాలను మరింత పెంచుతోంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మించిన ‘మైసా’లో రష్మిక ఒక గోండ్ గిరిజన అమ్మాయిగా కనిపిస్తోంది. ఈ పాత్రకు ఎమోషనల్ డెప్త్ తో పాటు శారీరక దృఢత్వం కూడా అవసరం. అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలు రూపొందుతున్నాయి. ఈ చిత్రం ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ సినిమాలకు కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయబోతోంది.
కథ విన్న తర్వాత రష్మిక ఈ పాత్ర కోసం తనను తాను శారీరకంగా, మానసికంగా పూర్తిగా మార్చుకోవాలని ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. రా, రియల్‌గా అనిపించే యాక్షన్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలనే లక్ష్యంతో ఆమె బ్యాంకాక్‌కు వెళ్లి కఠినమైన స్టంట్, కాంబాట్ ట్రైనింగ్‌ తీసుకుంటున్నారు.
ఆమె రోజువారీ శిక్షణ చాలా కఠినంగా సాగుతోంది. రోజుకు దాదాపు ఎనిమిది గంటల పాటు అడ్వాన్స్‌డ్ స్టంట్స్, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్, హై స్పీడ్ యాక్షన్ టెక్నిక్స్ నేర్చుకుంటోంది. ఆమె ట్రైనింగ్ ఫోటోలు చూస్తే సాధారణంగా కనిపించే సాఫ్ట్ నేచర్ ఇమేజ్‌కు పూర్తిగా భిన్నంగా, ఒక దృఢ సంకల్పంతో కూడిన యోధురాలిలా కనిపిస్తోంది.
త్వరలో కేరళలో 16 రోజుల పాటు కీలక యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. అందుకు అనుగుణంగా ఆమె ట్రైనింగ్ సాగుతోంది.
రష్మిక చేస్తున్న ఈ కఠిన శిక్షణను చూస్తే ‘మైసా’ ఆమె కెరీర్ లో మైలురాయి చిత్రంగా నిలవనుందని అర్ధమౌతోంది. ఆమె నెవర్ సీన్ అవతార్‌ ఆసక్తి మరింత పెరుగుతోంది.
ఈ చిత్రంలో ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సినిమాటోగ్రఫీని శ్రేయాస్ పి కృష్ణ నిర్వహిస్తుండగా, జేక్స్ బీజోయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండి లాంగ్ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు.
తారాగణం: రష్మిక మందన్న, ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేష్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రవీంద్ర పుల్లె
నిర్మాతలు: అన్‌ఫార్ములా ఫిల్మ్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డిఓపి: శ్రేయాస్ పి కృష్ణ
మార్కెటింగ్ : హాష్‌ట్యాగ్ మీడియా

See also  #Mega157 రెండవ షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.