Skip to content

‘రేజర్’ ఇంటెన్స్ & వైల్డ్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్

‘రేజర్’ ఇంటెన్స్ & వైల్డ్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ Telugu News
‘రేజర్’ ఇంటెన్స్ & వైల్డ్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ Telugu News

ఫార్ములా కథలకు దూరంగా, కొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన రవి బాబు, తన తాజా చిత్రం ‘రేజర్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సురేష్ బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఈ రోజు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

అవసరంలో ఉన్నవారికి దేవుడు రక్షకుడిగా దేవదూతను పంపుతాడని అంటారు. కానీ మరణం వెంబడిస్తూనే ఉండి, తప్పించుకోవడం అసాధ్యమయ్యే సమయంలో అదే దేవదూత విధ్వంసానికి ప్రతీకగా మారుతుంది. కరుణ మాయమైతే మిగిలేది కేవలం ఆగ్రహం మాత్రమే. తనకు కావాల్సిన వారిని కాపాడేందుకు కోపం, క్రోధం, కలహం, విధ్వంసం.. అన్నీ కలిసి ‘రేజర్’గా మారుతుంది

ట్రైలర్ ఒక డార్క్, ఫెరోషియస్ ప్రపంచాన్ని సూచిస్తోంది. ఈ కథలో రవి బాబు ఒక డాగ్ గ్రూమర్‌గా కనిపిస్తారు. ఒక చిన్న అమ్మాయిని కాపాడేందుకు అతను ఎంతవరకు వెళ్తాడో చూపించే పాత్ర ఇది. ఎమోషన్ ఇంటెన్సిటీ రెండింటినీ బ్యాలెన్స్ గా చూపించే పాత్రగా ఆసక్తిని పెంచింది.

రచయిత, దర్శకుడిగా రవి బాబు తన ప్రత్యేక స్టయిల్ ని కొనసాగిస్తూ, ఈసారి మరింత అందరికీ చేరువయ్యే కథనంతో ముందుకొచ్చారు. సాంకేతికంగా కూడా ఈ చిత్రం బలంగా ఉంది. చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ, ఎస్‌ఎస్ రాజేష్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సతీష్ పొలుజు యాక్షన్ కొరియోగ్రఫీ అన్నీ కలిసి సినిమాకు మరింత బలం చేకూర్చాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

ట్రైలర్ ఆసక్తిని పెంచుతూ ‘రేజర్’ను ఒక హై-వోల్టేజ్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుందని ప్రామిస్ చేస్తోంది. మే 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

See also  "రాజా సాబ్" సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడి చూస్తున్నారు: డైరెక్టర్ మారుతి

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.