‘గాయపడ్డ సింహం’ నుంచి స్వీకర్ అగస్తీ, రాపర్ అసుర సెటైరికల్ రాప్ సాంగ్ రిలీజ్
డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇటివల విడుదలైన ఫన్ ఫిల్డ్ ట్రైజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాకు సంబంధించిన ఫన్ ప్రమోషనల్ ర్యాప్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట సినిమా సాటైరికల్ టోన్‌ను అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. ఈ పాట హీరో అమెరికన్ డ్రీమ్ ఎలా ఒక్కసారిగా తలకిందులవుతుందో చూపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన డిపోర్టేషన్ నిర్ణయం తర్వాత హీరో జీవితంలో ఏర్పడే గందరగోళ పరిస్థితులను సరదాగా చూపించారు…
