Skip to content

మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’ ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్

మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’ ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

వెర్సటైల్ స్టార్ జగపతి బాబు ప్రధాన పాత్రలో ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’. SVCLLP నారాయణ దాస్ నారంగ్ ఆశీస్సులుతో చరిత చిత్ర బ్యానర్ పై కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో జగపతిబాబు ప్రెజెన్స్‌ పోస్టర్‌కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇంటెన్స్ లుక్‌, కళ్లద్దాల వెనుక కనిపించే కూల్ కాన్ఫిడెన్స్‌ పాత్రలోని పవర్‌ను సూచిస్తున్నాయి. బ్యాక్ డ్రాప్ లో నీలం–ఎరుపు రంగుల మధ్య విభజించిన అమ్మాయి ముఖం వెనుక ఒక పెద్ద మిస్టరీ దాగి ఉందనే ఫీలింగ్‌ను ఇస్తోంది. మొత్తానికి ఈ పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. ఫోటోగ్రఫీ డైరెక్టర్ గా చోటా కె. నాయుడు ISC, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం కార్తీక్ బి. కొడకండ్ల అందిస్తున్నారు. లక్ష్మీ భూపాల రచయితగా పని చేస్తున్నారు.

త్వరలోనే ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది.

నటీనటులు: జగపతిబాబు, లయ, హృతిక

బ్యానర్స్: చరిత చిత్ర, SVCLLP
నిర్మాతలు: కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్
దర్శకత్వం:ఆకెళ్ల వి కృష్ణ
ఫోటోగ్రఫీ డైరెక్టర్: చోటా కె. నాయుడు ISC
సంగీతం: కార్తీక్ బి. కొడకండ్ల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
రచయిత: లక్ష్మీ భూపాల
ఆర్ట్: బజ్జా బ్రహ్మయ్య
స్టంట్స్: డ్రాగన్ ప్రకాష్
సాహిత్యం: కృష్ణవేణి మల్లవజ్జల, శివకృష్ణ చారి ఎర్రోజు, వీరు గడ్డం
ప్రొడక్షన్ కంట్రోలర్: బొడ్డు సత్యనారాయణ
పబ్లిసిటీ డిజైన్: కృష్ణ డిజిటల్
పీఆర్వో: వంశీ, శేఖర్

See also  కింగ్ బుద్ధ డైరెక్టర్ సత్యారెడ్డికి ఢిల్లీలో ఘన సన్మానం

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.