Skip to content

గుర్రం పాపిరెడ్డి” నుంచి ‘ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి..’ లిరికల్ సాంగ్ రిలీజ్

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. త్వరలో "గుర్రం పాపిరెడ్డి" సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు "గుర్రం పాపిరెడ్డి" సినిమా నుంచి 'ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. 'ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి..' పాటకు సురేష్ గంగుల క్యాచీ లిరిక్స్ అందించగా, లక్ష్మి మేఘన, ఎంసీ చేతన్ ఎనర్జిటిక్ గా పాడారు. కృష్ణ సౌరభ్ ఆకట్టుకునే ట్యూన్ తో…

Read more

‘అర్జున్ చక్రవర్తి’ అందరికీ కనెక్ట్ అవుతుంది: నిర్మాత శ్రీని గుబ్బల

విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి'. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఇటివలే రీలీజైన్ టీజర్, సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీని గుబ్బల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీ నేపధ్యం గురించి ? -మాది వెస్ట్ గోదావరి తణుకు. మా నాన్నగారు గుబ్బల రామారావు సోషల్ వర్కర్. నేను యుఎస్ వెళ్లి 18 ఏళ్ళు అవుతుంది. నాకు మొదటి నుంచి క్రియేటివిటీ పై ఆసక్తి ఉంది. మేం…

Read more

పరదా’ ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది : నిర్మాత విజయ్ డొంకాడ

సినిమా బండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల 'పరదా' అనే మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌ తో వస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రైలర్ పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ‘పరదా’ ఆగస్ట్ 22న థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత విజయ్ డొంకాడ విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. పరదా కథని టేకాఫ్ చేయడానికి కారణం? -డైరెక్టర్ ప్రవీణ్…

Read more

ఘనంగా త్రివణ గురుపీఠం ప్రారంభోత్సవం

నిర్మాత హరిత గోగినేని, ఏఆర్ అభి ఆధ్వర్యంలో హైదరాబాద్ చిత్రపురి కాలనీలో త్రివణ గురుపీఠాన్ని ఏర్పాటు చేశారు. డివోషనల్, స్పిరిచువల్, ఆస్ట్రాలజీ కలిపి ఒక కొత్త మార్గాన్ని త్రివణ గురుపీఠం ద్వారా ఆవిష్కరిస్తున్నారు. ఈ రోజు త్రివణ గురుపీఠం ప్రారంభోత్సవ కార్యక్రమం పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ - ఈ రోజు త్రివణ గురుపీఠం విజయవంతంగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. వివిధ పూజా కార్యక్రమాలను నిర్విఘ్నంగా పూర్తి చేశాం. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ఆ దేవుడి కృప దక్కిందని నమ్ముతున్నాను. రాలేకపోయిన వారికి కూడా మంచి జరగాలని ప్రార్థిస్తున్నాం. త్రివణ గురుపీఠం అనేది డివోషనల్, స్పిరిచువల్,…

Read more

టీనేజ్ లైఫ్ లోని ఫన్నీ ఇన్సిడెంట్స్ ను “లిటిల్ హార్ట్స్” మూవీలో లైవ్ లీగా చూపించారు – టీజర్ రిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ "లిటిల్ హార్ట్స్". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ "లిటిల్ హార్ట్స్" మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కంటెంట్ నచ్చి నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సెప్టెంబర్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ రోజు ఈ చిత్ర టీజర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా రిలీజ్ చేశారు…

Read more

యూనివర్సిటీ సినిమాలో అద్భుతమైన ఎమోషన్స్ వున్నాయి… పద్మశ్రీ బ్రహ్మానందం

ప్రముఖ హాస్యనటులు పద్మశ్రీ బ్రహ్మానందం గారు మాట్లాడుతూ: యూనివర్శిటీ అంటే ఏమిటి యూనివర్స్ అంటే విశ్వం . అంటే అన్ని గోళాల తోటి ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి భూమి లాంటి గ్రహమే కాకుండా విశ్వాంతరాళాలలోని గ్రహాలన్నింటికీ సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేర్పేటటువంటిది ఆలయం. అదే విశ్వవిద్యాలయం అదే యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీ ఇపుడు ఎటువంటి విశ్వవిద్యాలయాలు అయ్యాయి అని చెప్పడానికి ఎంతో ఎంతో కృషి చేసి అందులో రీసెర్చ్ చేసి అందులో జరుగుతున్నటివంటి అవనీతిని… అప్పట్లో విశ్వవిద్యాలయాలు అంటే కాశీ విద్యాలయం అని పెద్ద పేరు బెనారస్ యూనివర్సిటీ. ఎక్కడెక్కడి నుంచో అన్ని దేశాల నుంచి మనదేశం వచ్చి చదువుకొనివెళ్లిపోయేవారు. అంటే అంత జ్ఞాన సంపద ఉన్న దేశం మనది. ఈవాళ మన దేశం…

Read more

ప్రెస్ నోట్

ది. 19.08.2025 సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, స్టూడియో యజమాని శ్రీ నందమూరి జయకృష్ణ గారి సతీమణి పద్మజ గారు ఈరోజు ఉదయం ఫిలిం నగర్, హైదరాబాద్ లో స్వర్గస్తులైనారు. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి శ్రీ జయకృష్ణ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ పద్మజ గారి ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నామని తెలియజెయడమైనది. టి. ప్రసన్నకుమార్ వై.వి.ఎస్. చౌదరి గౌరవ కార్యదర్శి గౌరవ కార్యదర్శి

Read more

సెప్టెంబర్ 5న రాబోతోన్న హారర్, లవ్, కామెడీ ఎంటర్టైనర్ ‘లవ్ యూ రా’.. ఘనంగా ఆడియో లాంచ్ ఈవెంట్

సముద్రాల సినీ క్రియేషన్స్ బ్యానర్ మీద చిన్ను హీరోగా, గీతికా రతన్ హీరోయిన్‌గా సముద్రాల మంత్రయ్య బాబు, కొన్నిపాటి శ్రీనాథ్ ప్రజాపతి నిర్మాతలుగా రానున్న చిత్రం ‘లవ్ యూ రా’. ఈ మూవీకి ప్రసాద్ ఏలూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీని సెప్టెంబర్ 5న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఈవెంట్‌ను సోమవారం (ఆగస్ట్ 18) నాడు నిర్వహించారు. ఈ క్రమంలో ‘ఏ మాయ చేశావే పిల్లా’, ‘వాట్సప్ బేబీ’, ‘యూత్ అబ్బా మేము’, ‘దైవాన్నే అడగాలా’ అనే పాటలను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో.. హీరో చిన్ను మాట్లాడుతూ .. ‘‘లవ్ యూ రా’ నాకు మొదటి చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన…

Read more

అక్టోబర్ 10న రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన ‘శశివదనే’ భారీ ఎత్తున విడుదల

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్ బ్యానర్ల మీద అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల నిర్మించిన చిత్రం ‘శశివదనే’. ఈ మూవీకి సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఫీల్ గుడ్ వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన ‘శశివదనే’ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు సోమవారం నాడు ప్రకటించారు. ‘శశివదనే’ చిత్రాన్ని దసరా సీజన్‌లో అక్టోబర్ 10న భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. ఈ మూవీకి శ్రీ సాయి కుమార్ దారా అందించిన విజువల్స్, శరవణ వాసుదేవన్ ఇచ్చిన సంగీతం…

Read more

ఆనందం, ఆహ్లాదం కలిపిన వైభోగం… అసలైన ప్రతిభకు పట్టాభిషేకం..

అంగరంగ వైభవంగా జరిగిన 24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమం. సినీ పెద్దల మధ్య, సినీ ప్రేమికుల మధ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు, లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారు, మురళీ మోహన్, ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్, డా. మోహన్ బాబు మంచు, విష్ణు మంచు, మాలశ్రీ, బాబు మోహన్ గారు, మొదలైన వారు హాజరయ్యారు. వైజయంతి మూవీస్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారికి ఘన సన్మానం చేయడం జరిగింది. అనంతరం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా అవార్డ్స్ ప్రదానం చేయడం జరిగింది. అలాగే డా. మోహన్ బాబు మంచు, విష్ణు…

Read more