‘అగమ్య’ చిత్రం వైభవంగా ప్రారంభం
తమ్మారెడ్డి భరద్వాజ గారి క్లాప్‌తో ఘనంగా ముహూర్తపు షాట్ ఆర్.ఆర్.బారు సమర్పణ లో రుషి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం. 2 గా రూపొందుతున్న ఆసక్తికర చిత్రం ‘అగమ్య’ ఆదివారం (నవంబర్ 29, 2026) ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. జగదీష్ దూగాన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాగేందర్ నాయుడు యన్నం నిర్మిస్తున్నారు. అనిల్ కుమార్, మానసి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు ప్రత్యేక అతిథిగా విచ్చేసి, హీరో హీరోయిన్లు అనిల్, మానసిలపై చిత్రీకరించిన తొలి ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టి చిత్రబృందాన్ని ఆశీర్వదించారు. అలాగే దిల్ రమేష్, గీతాసింగ్, ఆకెళ్ళ, షేకింగ్ శేషు…
