‘వృషకర్మ’ మిస్టికల్ థ్రిల్లింగ్ రైడ్ ట్రైలర్ నవంబర్ 25న రిలీజ్
యువ సామ్రాట్ నాగ చైతన్య ఇంతకుముందెన్నడూ చూడని కొత్త పాత్రలో నటిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 4న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైథాలజీ, మిస్టరీ, సస్పెన్స్ కలయికతో ఒక భారీ సినిమాటిక్ స్పెక్టకల్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పురాతన రహస్యాలు, మిస్టీరియస్ అంశాలతో కూడిన ఆసక్తికరమైన ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను నవంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నెల్లూరులోని 'SV కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్'లో జరిగే గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విడుదల చేయనున్నారు. ట్రైలర్ అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా సినిమాపై…
