Skip to content

‘418’ సినిమా ట్రైలర్ రిలీజ్

పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ‘418’తో డార్కర్ జానర్ లో అడుగుపెడుతోంది. సీరియస్, అన్‌సెటిలింగ్ నెరేటివ్‌తో భయాన్ని కొత్త కోణంలో చూపించబోతున్న ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ఈ సినిమాతో కీర్తన్ నాదగౌడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కథను కూడా ఆయనే రాశారు. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైత్ర ఆచార్, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓ పాడుబడిన ఇంట్లోకి ఒక్క పక్షి కూడా వెళ్లలేదని వాచ్‌మెన్ చెప్పడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అనంతరం 18…

Read more

ఇరుముడి నాకు విపరీతమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది – రవితేజ

మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ రన్ కొనసాగిస్తోంది. అన్ని వర్గాల ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మ రథం పడుతున్నారు. భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమా నేటికీ స్ట్రాంగ్ కలెక్షన్స్ నమోదు చేస్తుండటం విశేషం. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర జోరును కొనసాగిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా హీరో రవితేజ మాట్లాడుతూ.. మా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ చాలా చాలా థాంక్స్. ఇక నేను మాట్లాడటానికి ఏమీ లేదు.. అందరూ ఈ సక్సెస్ గురించి ఎంతో చెప్పారు. ఈ సినిమా నాకు విపరీతమైన సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఎంతో రెస్పెక్ట్…

Read more

మైత్రి మూవీ మేకర్స్ ‘418’ సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్

ఇటీవలే సంచలన బ్లాక్‌బస్టర్ 'ఇరుముడి'ని అందించిన పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స, '418'తో థియేటర్లకు ఒక విభిన్నమైన హారర్ చిత్రాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ఈ చిత్రంతో కీర్తన్ నాడగౌడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ఆయనే కథను కూడా అందించారు. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ థ్రిల్లర్ సెన్సార్‌తో సహా అన్ని లాంఛనాలను పూర్తి చేసుకుని 'ఎ' సర్టిఫికేట్‌ను పొందింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది. పోస్టర్ లో మసక వెలుతురులో…

Read more

విజయ్ దేవరకొండ “రణబాలి” సినిమా టీజర్ రిలీజ్

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ విజయ్ దేవరకొండ అభిమానులు, మూవీ లవర్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్న "రణబాలి" సినిమా టీజర్ వచ్చేసింది. ఈ టీజర్ విజయ్ దేవరకొండ నట విశ్వరూపాన్ని చూపిస్తూ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. రాక్షస రాజుగా పేరున్న సర్ థియోడర్ హెక్టార్ ఆజ్ఞపై పండిన ప్రతి ధాన్యపుగింజను దోపిడీ చేస్తూ అన్నపూర్ణగా వెలిగిన మన నేలను కరువు సీమగా మార్చేస్తుంటారు బ్రిటీష్ అధికారులు. ఆకలి అని అడిగిన వారిని క్రూరంగా చంపేస్తుంటారు. ఈ రాక్షస రాజు సర్ థియోడర్ హెక్టర్ కు, అతని అధికారులను తన ధైర్య సాహసాలతో అంతే క్రూరంగా ఎదుర్కొంటాడు రణబాలి. గుండె ధైర్యం నిండిన అతని దాటికి, పదునెక్కిన…

Read more

9న విజయ్ దేవరకొండ “రణబాలి” టీజర్ రిలీజ్

విజయదశమి పర్వదినం సందర్భంగా అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా "రణబాలి" సినిమా రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా…

Read more

నందమూరి మోక్షజ్ఞ తేజ, వశిష్ఠ, మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మక చిత్రం అనౌన్స్‌మెంట్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ తెలుగు చిత్రసీమలో తన తొలి అడుగు వేయడానికి సిద్ధమయ్యారు. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డెబ్యూ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నందమూరి కుటుంబానికి, అభిమానులకు ఇది మరో గొప్ప అధ్యాయానికి నాంది పలకనుంది. తన డెబ్యూ కోసం సరైన కథను ఎంచుకునేందుకు మోక్షజ్ఞ కావాల్సిన సమయం తీసుకున్నారు. పలు కథలను విన్న తర్వాత తనకు నచ్చిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ చేస్తున్న దర్శకుడు వశిష్ఠ ఈ కథను సిద్ధం చేశారు. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ మైత్రీ మూవీ…

Read more

‘ఇరుముడి’ జెనరేషనల్ బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్‌లో మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్

మాస్ మహారాజా రవితేజ జెనరేషనల్ బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న విడుదలై ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ఘన విజయాన్ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ జెనరేషనల్ బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు చిత్ర బృందం సమాధానాలు ఇచ్చారు. శివ నిర్వాణ గారు.. ఇరుముడి సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రేక్షకుల్ని ఇంతలా కనెక్ట్ చేసిన అంశం ఏమిటని దర్శకుడుగా మీరు భావిస్తున్నారు? -ఎమోషన్, అలాగే రియలిస్టిక్ వరల్డ్. నేను తీసుకున్న మూడు లేయర్స్.. వాటి బ్లెండింగ్ సూపర్‌గా వర్కౌట్…

Read more

అక్టోబర్ 16న “రణబాలి” సినిమా రిలీజ్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా "రణబాలి" సినిమా రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్…

Read more

‘ఇరుముడి’కి పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు: రవితేజ

మాస్ మహారాజా రవితేజ హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌తో, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ఘన విజయాన్ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. డైరెక్టర్ శివ ఈ సినిమా కోసం చాలా మంచి ఆర్టిస్టులను ఎంచుకున్నారు. కొమరం, భార్గవ్, కిషోర్ అందరూ సూపర్‌గా చేశారు. చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. అలాగే రమేష్ ఇంద్ర గారు కూడా బాగా చేశారు. స్టూడెంట్స్‌గా చేసిన అందరూ చక్కగా చేశారు. వాళ్లందరికీ చాలా మంచి ఫ్యూచర్…

Read more

ఇరుముడి చూసి నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది!

ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం చాలా అరుదుగా మాత్రమే చూస్తాం. C సెంటర్ల నుంచి పెద్ద పెద్ద సెంటర్ల వరకు అన్ని థియేటర్లలో షోలు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ఒకప్పుడు దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో విజయశాంతి గారు నటించిన ఓసే రాములమ్మ సినిమాకు జనాలు బండ్లు కట్టుకుని వచ్చి, రాత్రిళ్లు కూడా థియేటర్ల దగ్గర కాపలాలు కాసి సినిమా చూసిన రోజులను నేను చూశాను. అప్పుడు థియేటర్ల దగ్గర కనిపించిన ఆ జనసందోహం, ఆ ఉత్సాహం మళ్లీ ఇప్పుడు ఇరుముడి సినిమాకు కనిపిస్తోంది. ఫ్యామిలీస్‌తో కలిసి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తున్నారు. ఒక్క షో కూడా…

Read more