Skip to content

పాతబస్తీ మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో బంగారు బోనం ఎత్తిన సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల

హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్న వేళ, సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల పాతబస్తీ మీరాలం మండిలోని శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో అమ్మవారికి బంగారు బోనం ఎత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేదమంత్రాల నడుమ అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందిన అనంతరం ఆలయ అధికారులు ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గాజుల అంజయ్య నిహారికకు ఆలయ చరిత్రతో పాటు ఆలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాల విశిష్టత, సంప్రదాయాలను వివరించారు. అనంతరం నిహారిక మాట్లాడుతూ, ప్రధాన బోనాల రోజు షూటింగ్ ఉండటంతో ఆలయానికి రాలేకపోయానని, అందుకే అమ్మవారి దర్శనానికి వచ్చినట్లు తెలిపారు. తాను హైదరాబాద్‌లోనే పుట్టి…

Read more

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు రావడం ఎంతో గర్వకారణం – నిర్మాత ఫణి అడపాక

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో మా 'కమిటీ కుర్రోళ్లు' చిత్రానికి *ఉత్తమ తెలుగు చిత్రం (Best Telugu Film)*తో పాటు ఉత్తమ మేకప్ (Best Makeup) విభాగాల్లో రెండు జాతీయ అవార్డులు లభించడం పట్ల నిర్మాత ఫణి అడపాక హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "'సిద్ధార్థ్ రాయ్' సినిమాతో నిర్మాతగా నా ప్రయాణాన్ని ప్రారంభించాను. తొలి సినిమాతో ఎంతో విలువైన అనుభవాన్ని సొంతం చేసుకున్నాను. ఆ తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్తో కలిసి 'కమిటీ కుర్రోళ్లు' వంటి మంచి కథ, బలమైన భావోద్వేగాలు కలిగిన చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజు అదే చిత్రం 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు…

Read more

‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి జాతీయ అవార్డులు రావడంతో నా మనసు సంతృప్తితో నిండిపోయింది – నిహారిక కొణిదెల

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్ల మీద పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాణంలో నిహారిక కొణిదెల రూపొందించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. ఈ మూవీతో యదు వంశీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా 72వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సత్తా చాటుకుంది. ఉత్తమ జాతీయ తెలుగు చిత్రం, బెస్ట్ మేకప్ కేటగిరీల్లో రెండు జాతీయ అవార్డులను ‘కమిటీ కుర్రోళ్లు’ కొల్లగొట్టింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ తమ ఆనందాన్ని పంచుకునేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంలో పని చేసిన ప్రతీ ఒక్కరి జర్నీ నాకు తెలుసు. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి జాతీయ…

Read more

జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు -పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి

నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం సంతోషకరం 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, గాయనీగాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు. ప్రముఖ నటులు శ్రీ మమ్ముట్టి ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం సంతోషదాయకం. నాలుగవసారి ఆయన ఉత్తమ జాతీయ నటుడిగా నిలిచి యువ నటులకు స్ఫూర్తినిచ్చారు. శ్రీ మమ్ముట్టికి, ఆయనతోపాటు ఈ పురస్కారానికి శ్రీ కార్తీక్ ఆర్యన్ కు, ఉత్తమ నటిగా నిలిచిన శ్రీమతి యామీ గౌతమ్ కు అభినందనలు. తెలుగు చిత్ర పరిశ్రమకు పలు పురస్కారాలు దక్కడం శుభపరిణామం. ఉత్తమ పాపులర్ చిత్రంగా కల్కి 2898 ఎ.డి., ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో కల్కి 2898…

Read more

72వ జాతీయ చ‌ల‌నచిత్ర అవార్డుల్లో స‌త్తా చాటిన‌ ‘క‌మిటీ కుర్రోళ్ళు’

మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల‌ నిర్మాత‌గా మారి రూపొందించిన తొలి తెలుగు చిత్రం ‘క‌మిటీ కుర్రోళ్ళు’. పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్‌, శ్రీ రాధ దామోద‌ర్ స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై ప‌ద్మ‌జ కొణిదెల‌, జ‌య‌ల‌క్ష్మి అడ‌పాక ఈ సినిమాను నిర్మించారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో య‌దు వంశీ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇటు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లను అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌తో పాటు అవార్డుల రేసులోనూ స‌త్తా చాటుతోంది. శ‌నివారం (జూలై 18) రోజున భార‌త ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన 72వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల్లో క‌మిటీ కుర్రోళ్లు సినిమా రెండు అవార్డుల‌ను సొంతం చేసుకుంది. తెలుగులో జాతీయ ఉత్త‌మ చిత్రంగా నిల‌వ‌టంతో పాటు మేక‌ప్ కేట‌గిరిలో (పి.ర‌వికుమార్‌) ఈ సినిమా అవార్డును…

Read more
‘వంద దేవుళ్ళు’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల Telugu News

‘వంద దేవుళ్ళు’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల

విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి నిర్మించిన చిత్రం ‘వంద దేవుళ్ళు’. ఈ మూవీని జూన్ 19న విడుదల చేయబోతోన్నారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పాటలు, పోస్టర్లు ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ‘ఈ లోకంలో ప్రాణాలతో పుట్టిన అందరికీ కనీస…

Read more
1.2 మిలియన్ వ్యూస్ ..నాన్ ఇంగ్లీష్ మూవీస్‌లో ట్రెండింగ్ బ్లాక్‌బస్టర్ ‘రాకాస’. Telugu News

1.2 మిలియన్ వ్యూస్ ..నాన్ ఇంగ్లీష్ మూవీస్‌లో ట్రెండింగ్ బ్లాక్‌బస్టర్ ‘రాకాస’.

‘రాకాస’ సినిమాకు థియేటర్లో అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఓటీటీలోనూ ఈ చిత్రం దూసుకుపోతోంది. నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్‌లో టాప్ 7కి ‘రాకాస’ చేరుకుంది. ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు 1.2 మిలియన్ వ్యూస్‌తో ఏడో స్థానంలో ట్రెండ్ అవుతూ ఉందని నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రకటించింది. ఈ ఘనతతో ఈ వారం నెట్ ఫ్లిక్స్‌పై ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన ఆంగ్లేతర చిత్రాల జాబితాలో 'రాకాస' పలు అంతర్జాతీయ మార్కెట్ల చిత్రాల సరసన నిలిచింది. థియేటర్లలో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కంటే డిజిటల్ స్ట్రీమింగ్‌లో మరింత ఆదరణ లభిస్తోందని ఈ లెక్కలే చెబుతున్నాయి. థియేటర్లలో నెమ్మదిగా మౌత్ టాక్‌తో దూసుకుపోయిన ఈ సినిమా ఇప్పుడు…

Read more
వరుణ్ తేజ్ మోకాలి  శస్త్ర చికిత్స పూర్తి Telugu News

వరుణ్ తేజ్ మోకాలి శస్త్ర చికిత్స పూర్తి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘బరి’. రీసెంట్‌గానే సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా వ‌రుణ్ తేజ్ వాలీ బాల్ ఆట‌ను ప్రాక్టీస్ చేస్తుండ‌గా మోకాలికి తీవ్ర గాయ‌మైంది. ఈ మోకాలి గాయానికి సంబంధించి వ‌రుణ్ తేజ్‌కు శ‌స్త్ర చికిత్స జ‌రిగింది. ఈ విష‌యాన్ని నిహారిక త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేశారు. ‘నా సోద‌రుడు వ‌రుణ్ తేజ్ ఇటీవ‌ల మేం రూపొందిస్తోన్న బ‌రి సినిమా కోసం వాలీబాల్‌ను ప్రాక్టీస్ చేస్తుండ‌గా మోకాలికి తీవ్ర గాయ‌మైంది. తాజాగా ఆయ‌న్ని ప‌రిశీలించిన డాక్ట‌ర్స్ మోకాలికి ఆపరేష‌న్ చేశారు. ఈ…

Read more
10 రోజుల్లో రూ.22.60 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను సాధించిన ‘రాకాస‌’ Telugu News

10 రోజుల్లో రూ.22.60 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను సాధించిన ‘రాకాస‌’

విడుద‌లైన‌ 10 రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.22.60 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించిన‌ ‘రాకాస’ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఇంకా త‌న స‌త్తాను చాటుతోంది. రిలీజైన రోజు నుంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఇంకా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ కొన‌సాగుతుండ‌టం విశేషం. ఇది చూస్తుంటే ఈ స‌క్సెస్ జోరు మరింత‌గా కొన‌సాగుతుంద‌నే సంకేతాల‌ను సూచిస్తోంది. ఈ విజ‌యానికి ప్రధాన కారణం థియేటర్లలో ప్రేక్షకుల నుంచి వ‌స్తోన్న స్పంద‌న‌. రాకాస‌ సినిమాను ప్రేక్ష‌కులు వారి కుటుంబంతో క‌లిసి వ‌చ్చి వీక్షించి స‌ర‌దాగా న‌వ్వుకుని ఆస్వాదిస్తున్నారు. ఈ రెస్పాన్స్ ప్రతి షోలో కనిపిస్తోంది. ఈ రెస్పాన్స్ కొన‌సాగుతుండ‌టంతో సినిమాకు ఓ స్థిర‌మైన ర‌న్ కొన‌మంచి స్పందన రావడం వల్ల ఈ సినిమాకు థియేట‌ర్స్‌లో స్థిరమైన…

Read more
నేను చేసే ప్రతి సినిమా తో డిస్ట్యూటర్స్ హ్యాపీ గా ఉండేలా చూసుకుంటాను. – నిర్మాత నీహారిక కొణిదెల Telugu News

నేను చేసే ప్రతి సినిమా తో డిస్ట్యూటర్స్ హ్యాపీ గా ఉండేలా చూసుకుంటాను. – నిర్మాత నీహారిక కొణిదెల

*నిహారిక చేసే సినిమాలన్నీ మేమే డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటున్నాను - ‘రాకాస’ బ్లాక్ బస్టర్ డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్ మీట్‌లో మైత్రి రవి* *ఆడియెన్స్ థియేటర్ల వరకు వచ్చి, సినిమాని చూసి, ఇంత పెద్ద హిట్ చేశారు - ‘రాకాస’ బ్లాక్ బస్టర్ డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్ మీట్‌లో బ్రహ్మాజీ* మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ఉమేష్ కుమార్ బన్సల్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘రాకాస’. ఈ మూవీలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాకి మానస శర్మ దర్శకత్వం వహించారు. గత వారం విడుదలైన ఈ చిత్రం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ మూవీ సాధించిన…

Read more