‘ఆకాశంలో ఒక తార’ చిత్ర బృందాన్ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి
వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. సాత్విక వీరవల్లి కథానాయికగా నటించగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో కనిపించారు. నవంబర్ 20న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రం ట్రెమండస్ రెస్పాన్స్‌తో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా తన నివాసానికి ఆహ్వానించి, పుష్పగుచ్ఛాలతో అభినందించారు. ఈ సందర్భంగా సినిమాలోని పలు అంశాల గురించి చిత్ర బృందంతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. దుల్కర్…
