‘టాక్సిక్ ’లో నాడియా పాత్రలో కియారా అద్వానీ
2026లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న భారీ చిత్రాల్లో రాకింగ్ స్టార్ హీరోగా నటిస్తోన్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్’ ఒకటి. ఈ సినిమాపై రోజు రోజుకీ అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి నాడియా పాత్రలో నటిస్తోన్న హీరోయిన్ కియారా అద్వానీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేయటంతో ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహం పెరిగింది. ఎమోషనల్, హై వోల్టేజ్ కమర్షియల్ మూవీస్ ఇలా... వైవిధ్యమైన సినిమాలు, పాత్రల్లో నటిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకుంది కియారా అద్వానీ . ఇప్పుడు గీతూ మోహన్ దాస్ రూపొందిస్తోన్న శక్తివంతమైన ప్రపంచంలోకి నాడియా పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ పాత్ర ఆమె ఫిల్మోగ్రఫీ రేంజ్‌లో మరింత పెంచేలా…
