నేను ప్రమోట్ చేసింది రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్ – హీరో విజయ్ దేవరకొండ
రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్స్ కు, బెట్టింగ్ యాప్స్ కు మధ్య తేడా అందరూ గమనించాలని అన్నారు హీరో విజయ్ దేవరకొండ. తాను ప్రమోషన్ చేసింది రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్ కు అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఈ రోజు ఈడీ అధికారుల విచారణకు హాజరైన హీరో విజయ్ దేవరకొండ అధికారులకు అడిగిన వివరాలు అందించారు. అనంతరం మీడియాతో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్స్ వేరు, బెట్టింగ్ యాప్స్ వేరు. దీని మధ్య తేడా ఏంటనేది మన మీడియా మిత్రులు ప్రచారం చేయాలి. ఏ23, మై 11 సర్కిల్, డ్రీమ్ 11 వంటి రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్స్ ఇండియన్ క్రికెట్ టీమ్, మన…
