Skip to content

ఈ నెల 31న “అదే నీవు అదే నేను” మూవీ రిలీజ్

ఇటీవల ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రెండు అవార్డులు సాధించిన “కమిటీ కుర్రోళ్లు” మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, “సిద్ధార్థ్ రాయ్” సినిమా ఫేమ్ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా “అదే నీవు అదే నేను”. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్ పై గోవిందు కాండ్రేగుల నిర్మిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో యువ దర్శకుడు కొండల్ రూపొందిస్తున్నారు. “అదే నీవు అదే నేను” సినిమా సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

“అదే నీవు అదే నేను” సినిమా ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా రిలీజ్ చేసిన టీజర్ “1 మిలియన్ వ్యూస్” తో డిజిటల్ మీడియాలో దూసుకెళ్తోంది. స్టార్ డైరెక్టర్ వి వి వినాయక్ చేతుల మీదుగా లాంఛ్ చేసిన మనసా మనసా సాంగ్ హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఈ చిత్రం నుంచి మధురమా పాటను క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, యంగ్ హీరో ఆకాష్ పూరి, నటి ఇంద్రజ మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు. ఇలా చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖుల బెస్ట్ విశెస్ అందుకున్న “అదే నీవు అదే నేను” సినిమా మీ సమీప థియేటర్స్ లో రిలీజ్ కు వస్తోంది. ఒక గేటెడ్ కమ్యూనిటీలో జరిగే సరికొత్త రొమాంటిక్ థ్రిల్లర్ కథతో అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆద్యంతం ఆసక్తిని పంచేలా ఈ సినిమా ఉండబోతోంది. “అదే నీవు అదే నేను” సినిమా విజయంపై మూవీ టీమ్ పూర్తి నమ్మకంతో ఉన్నారు.

నటీనటులు – త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వి నేగి, సహర్ కృష్ణన్, కల్పలత, సునయన, బిత్తిరి సత్తి, మీర్, సూర్యతేజ, నరేందర్, రమణ భార్గవ్, తదితరులు

టెక్నికల్ టీమ్
——————————
ఆర్ట్ డైరెక్టర్ – నార్ని శ్రీనివాస్
లిరిక్స్ – పూర్ణాచారి
డైలాగ్స్ – వై.అమ్మిరాజు
డీవోపీ – నిమ్మల జయపాల్ రెడ్డి
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
మ్యూజిక్ – కనిష్క
ప్రొడ్యూసర్ – కాండ్రేగుల గోవిందు
స్క్రిప్ట్, డైరెక్షన్ – కొండల్

Photos Link – https://we.tl/t-1Chc1aYQknAj6ocL

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.