Skip to content

ఏప్రిల్ 24న ‘ఓ అందాల రాక్షసి’ రీ-రిలీజ్

ఏప్రిల్ 24న ‘ఓ అందాల రాక్షసి’ రీ-రిలీజ్ Telugu News
ఏప్రిల్ 24న ‘ఓ అందాల రాక్షసి’ రీ-రిలీజ్ Telugu News
ఏప్రిల్ 24న ‘ఓ అందాల రాక్షసి’ రీ-రిలీజ్ Telugu News
ఏప్రిల్ 24న ‘ఓ అందాల రాక్షసి’ రీ-రిలీజ్ Telugu News

మల్టీ టాలెంటెడ్ షెరాజ్ మెహదీ దర్శకత్వంలో తానే హీరోగా నటించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. గతంలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ప్రేక్షకుల అభ్యర్థన మేరకు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24న రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి, అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు షెరాజ్ మెహదీ మాట్లాడుతూ,
“అమ్మాయిలకు మోసాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ సబ్జెక్టు ఎంచుకున్నాను. ఈ సినిమా గ్లామర్‌పై ఆధారపడినది కాదు. మంచి కథా వస్తువుతో రూపొందిన వుమెన్ ఓరియెంటెడ్ చిత్రం. సమాజంలో అమాయక మహిళలు ఎలా మోసపోతున్నారో చూపించడంతో పాటు, అలాంటి మోసాలకు పాల్పడేవారికి తగిన శిక్ష తప్పదనే సందేశాన్ని కూడా అందిస్తున్నాం. గతంలో ఈ సినిమాను మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు రీ-రిలీజ్ సందర్భంగా థియేటర్లకు వచ్చి చూడాలని కోరుతున్నాను” అని తెలిపారు.

ఈ చిత్రం కన్నడలో ‘ఓ సుందర రాక్షసి’ పేరుతో విడుదలై అక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. చిత్రంలో
విహాన్షి హెగాడే, కృతి వర్మ, నేహా దేశపాండే, తమ్మారెడ్డి భరద్వాజ్, సుమన్ తల్వార్, షెరాజ్ మెహదీ, నేహా దేశ్‌పాండే, అనంత్ బాబు, ప్రియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి షెరాజ్ మెహదీ సంగీతాన్ని కూడా అందించడం విశేషం.

అమ్మాయిలపై వేధింపులు, అత్యాచారాలకు పాల్పడేవారికి ఎలాంటి శిక్షలు ఉండాలి? మహిళల జోలికి వస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? అనే సామాజిక అంశాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని షెరాజ్ మెహదీ ప్రభావవంతంగా తెరకెక్కించారు.

ఈ చిత్రంలో షెరాజ్ మెహదీ హీరోగా నటించగా, విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్‌పై సురీందర్ కౌర్ నిర్మాతగా, తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా, షేర్ సమర్పణలో ఈ చిత్రం నిర్మితమైంది.

నటీనటులు: షెరాజ్ మెహదీ, విహాన్షి హెగాడే, కృతి వర్మ, నేహా దేశపాండే, తమ్మారెడ్డి భరద్వాజ్, సుమన్ తల్వార్, అనంత్ బాబు, షెరాజ్ మెహదీ, విహాన్షి హెగ్డే, కృతి వర్మ, నేహా దేశ్‌పాండే, అనంత్ బాబు, ప్రియా తదితరులు.

బ్యానర్‌: స్కై ఈజ్ ది లిమిట్ స్టూడియోస్
సమర్పణ: షేర్
నిర్మాత: సురీందర్ కౌర్
సహ నిర్మాత: తేజిందర్ కౌర్
దర్శకత్వ, సంగీతం: షెరాజ్ మెహదీ
PRO: అశోక్ దయ్యాల

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.