అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘శ్రీనివాస మంగాపురం’లోని మంగా మంగా సాంగ్
‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమౌతున్న జయకృష్ణ ఘట్టమనేని తన స్టన్నింగ్ లుక్స్, ఆకట్టుకునే బేస్ వాయిస్‌తో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు అన్న కొడుకుగా భారీ అంచనాల మధ్య ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న ఆయన ఆ అంచనాలకు తగ్గట్టుగానే తన ప్రామిస్‌ను నిలబెట్టుకుంటున్నారు. ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి విభిన్న చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రియేటివ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’విజువల్‌గా అద్భుతమైన, వైలెంట్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోంది. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన తొలి సింగిల్ ‘అలెల్లే అలెల్లే’…
