శర్వానంద్ ‘భోగి’ నుంచి డింపుల్ హయాతి ఫస్ట్ లుక్ విడుదల
చార్మింగ్ స్టార్ శర్వా, మాస్ మేవరిక్ సంపత్ నందితో కలిసి చేస్తున్న భారీ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ సాగా 'భోగి'. ప్రతిష్టాత్మక శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మాణంలో, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్న ఈ చిత్రం, శర్వా కెరీర్‌లో అత్యంత భారీ స్థాయి వెంచర్‌లలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. ప్రమోషనల్ మెటీరియల్‌కు లభించిన అద్భుతమైన స్పందన నేపథ్యంలో చిత్ర నిర్మాతలు ఇప్పుడు డింపుల్ హయాతి పాత్ర లుక్‌ను రిలీజ్ చేశారు. డింపుల్ హయతి ఈ చిత్రంలో ‘మందారం’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆమె ఎర్ర చీరలో బోల్డ్ అండ్ స్టన్నింగ్ లుక్‌లో ఆకట్టుకున్నారు. చేతిలో విసనకర్ర పట్టుకుని, ఇంటెన్స్ హావభావాలతో కనిపిస్తున్న ఆమె లుక్ 1960ల కాలాన్ని…
