శర్వానంద్ ‘భోగి’ సినిమా నుండి ‘ఏగిలివారంగ’ సాంగ్ రిలీజ్
చార్మింగ్ స్టార్ శర్వా ‘భోగి’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్ఠాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇటీవల విడుదలైన టీజర్‌తో ప్రారంభమయ్యాయి. టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ‘భోగి’ మ్యూజికల్ ప్రమోషన్స్ తాజాగా ‘ఏగిలివారంగ’ పాట విడుదలతో ప్రారంభమయ్యాయి. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే ఈ జానపద గీతం సినిమా నేపథ్యాన్ని అద్భుతంగా పరిచయం చేస్తోంది. మట్టి వాసనతో కూడిన జానపద పాటలను రూపొందించడంలో తన ప్రత్యేకతను చాటుకున్న భీమ్స్ సిసిరోలియో ఈ పాటకు అందమైన బాణీని అందించారు. విభిన్నమైన సంగీత…
