‘సహ'(లైఫ్ ఆఫ్ సంజు) సెప్టెంబర్ 4న రిలీజ్
నిశాంత్ దోటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎమోషనల్ డ్రామా ‘సహా (లైఫ్ ఆఫ్ సంజు)’ ప్రస్తుతం ప్రమోషన్స్ తో సందడి చేస్తోంది. శివ కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ప్రేమ, అనుబంధాలు, జ్ఞాపకాలు, జీవితంలో ఎదురయ్యే భావోద్వేగ సంఘర్షణల చుట్టూ సాగనుంది. సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజ వెల్పుచర్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తి పెంచుకున్న ‘సహా’ సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌లో శివ కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ జర్నీలో ఆత్మీయంగా కనిపించారు. ఈ విజువల్ ఇద్దరి మధ్య ప్రేమ, అనుబంధాన్ని సహజంగా…
