Skip to content

“Genz With Siva” పాట విడుదల

ప్రముఖ తెలుగు యాడ్ ఫిల్మ్ మేకర్ యమునా కిషోర్ రూపొందించి, నిర్మించిన భక్తి గీతం “Genz With Siva” విడుదలైంది. ఈ పాటకు యమునా కిషోర్ స్వయంగా గాత్రాన్ని అందించగా, డా. జోస్యభట్ల సంగీతాన్ని సమకూర్చారు. ఈ మ్యూజిక్ వీడియో లో సాండిల్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించారు. కాశీలోని 84 ఘాట్ల పేర్లను, 108 శివ స్తోత్రాలను ఒకే గీతంలో మేళవించడం ఈ పాటలోని ప్రత్యేకత. కాశీ ఆధ్యాత్మిక వైభవాన్ని, శివతత్వాన్ని సంగీత రూపంలో ఆవిష్కరించే వినూత్న ప్రయత్నమిది. నేటి యువతకు శివుడిని మరింత చేరువ చేయాలనే ఆలోచనతో “Genz With Siva” రూపొందించబడింది. కాశీ వీధుల్లో, ఘాట్లలో ఒక యువకుడు చేసే ఆధ్యాత్మిక అన్వేషణను ఈ పాట ఆవిష్కరిస్తుంది. ఆధునిక…

Read more

ఓటీటీలోకి వచ్చేసిన మయూఖ

థియేటర్లలో మంచి స్పందనతో పాటు, న్యూయార్క్ మరియు కేన్స్‌లో అంతర్జాతీయ అవార్డుల గుర్తింపు పొందిన 'మయూఖ' ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయింది. శశిధర్ నల్ల, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలే కాదు.. బలమైన కథ, విభిన్నమైన కథనం ఉంటే చిన్న సినిమాలు కూడా పెద్ద సంచలనాలు సృష్టించగలవని నిరూపించిన చిత్రం 'మయూఖ'. దర్శకుడు శ్రీ తేజ్ SK తెరకెక్కించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌లో పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని శశిధర్ నల్ల, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందిన మయూఖ, తన…

Read more

సుమ చేతుల మీదుగా అమీర్‌పేటలో “వరం” ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం

ఫైన్ ఫ్యాషన్ జ్యువెలరీలో ఆధునిక లగ్జరీ అనుభూతిని అందించనున్న VARAM హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో VARAM తన తొలి ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను నవంబర్ 20, 2026న ఘనంగా ప్రారంభించింది. ప్రముఖ యాంకర్, నటి, నిర్మాత సుమ గారు ఉదయం 10 గంటలకు ఈ స్టోర్‌ను ప్రారంభించారు. ఆధునిక హంగులతో రూపొందించిన ఈ 1,500 చదరపు అడుగుల స్టోర్‌లో వివిధ రకాల ఫ్యాషన్ జ్యువెలరీ అందుబాటులో ఉన్నాయి. ఇయర్‌రింగ్స్, నెక్లెస్‌లు, రింగ్స్, బ్రేస్‌లెట్స్, హారాలు, వడ్డాణాలు, ప్రత్యేకంగా రూపొందించిన జ్యువెలరీ సెట్స్ వంటి విస్తృత శ్రేణి ఆభరణాలను ఇక్కడ కస్టమర్లు వీక్షించడంతో పాటు ధరించి తమకు నచ్చిన స్టైల్స్‌ను ఎంచుకోవచ్చు. ఈ సందర్భంగా VARAM వ్యవస్థాపకురాలు, CEO ప్రియాంక వేములూరి మాట్లాడుతూ.. “మా VARAM తొలి…

Read more

‘వృషకర్మ’ లార్జ్ స్కేల్ థియేట్రికల్ స్పెక్టికల్. డిసెంబర్ 4న మీరు భారీ అంచనాలతో థియేటర్లకు రండి – నాగ చైతన్య

యువ సామ్రాట్ నాగ చైతన్య, కార్తీక్ దండు, ఎస్వీసీసీ & సుకుమార్ రైటింగ్స్ ‘వృషకర్మ’ నుంచి మనసును హత్తుకునే మెలోడీ ‘ఛలో పదవే’ రిలీజ్ యువ సామ్రాట్ నాగ చైతన్య ‘వృషకర్మ’ సినిమాతో ప్రేక్షకులను మైథాలజీ, మిస్టరీతో కూడిన ఆసక్తికరమైన ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక థ్రిల్లర్ పురాతన రహస్యాలు, దాగి ఉన్న నిజాలు, ఉత్కంఠభరితమైన అంశాల చుట్టూ సాగుతుంది. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను బాపినీడు సమర్పిస్తున్నారు. రిచ్ విజువల్స్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ప్రేక్షకులకు బిగ్ స్క్రీన్‌పై కొత్త అనుభూతిని అందించేలా ఈ చిత్రాన్ని…

Read more

‘భోగి’ నవంబర్ 27న వరల్డ్‌వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా పూర్తిగా రస్టిక్ అవతార్‌లో కనిపించనున్న ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌తో పాటు పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. మరో 10 రోజుల్లో, నవంబర్ 27న ‘భోగి’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. డిసెంబర్, జనవరి నెలల్లో సినిమాల రిలీజ్‌ల రద్దీ ఎక్కువగా ఉండటంతో, ఈ సినిమాకు నవంబర్ 27 సరైన రిలీజ్ డేట్‌. సెన్సార్ సమస్యల…

Read more

‘టైసన్ నాయుడు’ అదిరిపోయే యాక్షన్ రైడ్‌ టీజర్‌ రిలీజ్

యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టైసన్ నాయుడు’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకు చూడని డిఫరెంట్ మాస్ అవతార్‌లో ఆయన కనిపిస్తుండటంతో ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే ప్రత్యేకమైన పాత్రగా నిలవనుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తుండగా, హరీష్ కట్ట ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ అనౌన్స్‌మెంట్, గ్లింప్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. జానపద…

Read more

“రాజిగాడు రాజయ్యాడు” సినిమాతో అల్తాఫ్ హసన్ చరిత్ర సృష్టించబోతున్నాడు – డా. గోరటి వెంకన్న

"బట్టల రామస్వామి బయోపిక్కు" సినిమా ద్వారా తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అల్తాఫ్ హసన్. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తూ "రాజిగాడు రాజయ్యాడు" అనే కొత్త చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను శర్మాస్ ఫిలింస్ బ్యానర్ పై బత్తుల పర్విన్, మనోజ్ అర్రోల, చిన్ని నిర్మిస్తున్నారు. "రాజిగాడు రాజయ్యాడు" మూవీలో అను శ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ కవి, గాయకుడు డా. గోరటి వెంకన్న కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు "రాజిగాడు రాజయ్యాడు" సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు కేశవ మాట్లాడుతూ - మంచి కాన్సెప్ట్, స్టోరీతో వస్తున్న చిత్రమిది. మంచి…

Read more

‘మ్యాడ్’ ఫేమ్ రామ్ నితిన్ కొత్త సినిమా.. తెలుగు, తమిళ భాషల్లో లవ్‌స్టోరీ!

‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన యువ హీరో రామ్ నితిన్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సోల్జర్స్ ఫ్యాక్టరీ (Soldiers Factory), రెడాక్టెడ్ స్టూడియోస్ (Redacted Studios) సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది. టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం ఓ అందమైన ప్రేమకథగా తెరకెక్కనుంది. ఈ సినిమాలో రామ్ నితిన్ సరసన ప్రథానా నాథన్ (Prathana Nathan), తేజు అశ్విని (Teju Ashwini)హీరోయిన్లుగా నటిస్తున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న రామ్ నితిన్‌కు ఈ సినిమా మరో మంచి సినిమా అవుతుందని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమాతో కార్తిక్ జై పళని దర్శకుడిగా పరిచయం…

Read more

#RaPo23 ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్ ప్రీ-లుక్ రిలీజ్.. త్వరలోనే ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #RaPo23 ప్రీ-లుక్‌ను ‘ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్’ అనే ట్యాగ్‌లైన్‌ తో ఇంటర్నేషనల్ మెన్‌స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్ సినిమా కథ, రామ్ పాత్రపై క్యూరియాసిటీ పెంచుతోంది. ప్రీ-లుక్ పోస్టర్‌లో రామ్ చాలా మిస్టీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. భారీ నిర్మాణంతో ఉన్న ఓ ఆర్కిటెక్చరల్ బిల్డింగ్‌లో మెట్లపై కెమెరాకు వెనుకవైపు తిరిగి నిలబడి ఉన్నారు. బ్లాక్ డ్రెస్‌లో, వెనుక భాగంలో V ఆకారంలో చిన్నగా కట్ చేసిన హెయిర్ స్టైల్‌తో కనిపిస్తున్నారు. తల వెనుక భాగంలో ఉన్న ప్రత్యేకమైన టాటూ ఆయన లుక్‌కు మరింత రఫ్‌నెస్ తీసుకొచ్చింది. ఒక చేతిలో గన్, మరో…

Read more

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన “క్రేజీ కల్యాణం” సినిమా

'నవరసరాయ' డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "క్రేజీ కల్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందించారు. గత నెల 16న థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "క్రేజీ కల్యాణం" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళంలో ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్స్ ఈ…

Read more