Skip to content

‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’ చిత్రం ప్రారంభం

హైదరాబాద్: ఆధునిక కాలంలోనూ మూఢనమ్మకాలను ఎండగట్టే ఉత్కంఠ రేపుతూ ఆసక్తికరంగా సాగే కథనంతో తెలుగు తెరపైకి ఓ సినిమా రాబోతుంది. రాజేష్ భూపతి, స్వప్నరాజ్, అబిత హీరో హీరోయిన్లుగా, ప్రముఖ నటుడు సుమన్, ఆమని ప్రధాన పాత్రల్లో, బి.వి.సి ఫిల్మ్స్ బ్యానర్‌పై, 'Eట్లు' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న రోశిరెడ్డి పందిళ్లపల్లి దర్శకుడిగా . విభిన్న కథా చిత్రం 'నిమ్మకాయ.. నీకెందుకు భయం' ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని అమీర్‌పేట సారథి స్టూడియోస్‌లో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి పీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా క్లాప్ కొట్టారు. లయన్ వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేయాగా, తొలి షాట్ కు టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని…

Read more

‘అమీర్ లోగ్’ను రిలీజ్ చేయబోతోన్న రానా ‘స్పిరిట్ మీడియా

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అమీర్‌ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో వేదశ్రీ, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి పలువురు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ పోస్టర్, రాహుల్ సిప్లిగంజ్ పాడిన అవ్వల్ దావత్ సాంగ్, టీజర్ ఇలా అన్నీ బజ్‌ను క్రియేట్ చేశాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ చిత్రంగా రాబోతోంది ‘అమీర్ లోగ్’. రానా ‘స్పిరిట్ మీడియా’ ఈ ‘అమీర్ లోగ్’ మూవీ…

Read more

‘సూపర్ సుబ్బు’తో మురళీ శర్మ ఓటీటీ ఎంట్రీ

జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న కామెడీ-డ్రామాలో కుక్కుటేశ్వరరావు పాత్రలో మురళీ శర్మ మూడు దశాబ్దాలకుపైగా హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, మరాఠీ భాషల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు మురళి శర్మ ఇప్పుడు తన తొలి ఓటీటీ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ ద్వారా ఆయన డిజిటల్ ప్రపంచంలో అడుగుపెడుతున్నారు. ఈ సిరీస్‌లో మురళీ శర్మ కుక్కుటేశ్వరరావు అనే క్రమశిక్షణ, సంప్రదాయాలకు పెద్దపీట వేసే తండ్రి పాత్రలో కనిపించనున్నారు. అయితే తన కుమారుడు సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా మారాలనే నిర్ణయం తీసుకోవడంతో ఆయన నమ్మకాలు, ఆలోచనల్లో జరిగే మార్పుల చుట్టూ కథ సాగుతుంది. మాకిపూర్ అనే గ్రామం…

Read more

సమీక్ష: LGBT – ఏ లీగల్ బ్యాటిల్ , వినోదంతో పాటు ఆలోచింపజేసే అద్భుతమైన సినిమా

రేటింగ్: 3.5/5 సామాజికంగా ఇప్పటికీ పూర్తిస్థాయి అంగీకారం పొందని LGBTQ+ అంశాన్ని ప్రధాన కథాంశంగా తీసుకుని రూపొందిన చిత్రం “LGBT – ఏ లీగల్ బ్యాటిల్”. సామాజిక సమస్యలను తన సినిమాల ద్వారా ప్రస్తావించే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మరోసారి ఒక సున్నితమైన అంశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. కిరణ్ అనే వ్యక్తి తన అసలు వ్యక్తిత్వాన్ని గుర్తించి మోహినిగా మారే ప్రయాణం చుట్టూ కథ సాగుతుంది. ఈ ప్రయాణంలో ఎదురయ్యే కుటుంబ సమస్యలు, సమాజం చూపించే వివక్ష, చట్టపరమైన పోరాటాలు కథకు ప్రధాన బలంగా నిలుస్తాయి. దర్శకుడు ఎక్కడా అతిశయోక్తులకు పోకుండా వాస్తవికతకు దగ్గరగా కథను చెప్పేందుకు ప్రయత్నించారు. సినిమా ప్రధానంగా వ్యక్తిగత గుర్తింపు, గౌరవం, సమాన హక్కులు…

Read more

AMB సినిమాస్‌పై జరిమానా వార్తలు పాతవే – క్లారిటీ ఇచ్చిన మేనేజ్‌మెంట్

హీరో మహేష్ బాబుకు చెందిన AMB సినిమాస్‌ పై జరిమానా అంటూ మీడియాలో వస్తున్న వార్త ఇప్పటిది కాదు.. ఈ విషయానికి సంబంధించిన అన్ని క్లియరెన్స్ లు పూర్తయ్యాయి.. పాత వార్తను ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు.. దయచేసి అలాంటి వార్తలను కవర్ చేయవద్దని కోరుతున్నాం -AMB Management

Read more

‘హ్యాంగ్‌మెన్’ గొప్ప చిత్రం అవ్వాలని కోరుకుంటున్నాను: పద్మశ్రీ డా. బ్రహ్మానందం

అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్, క్లోరో ఫిల్మ్ బ్యానర్ల మీద బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో విహాన్ తెరకెక్కించిన చిత్రం ‘హ్యాంగ్‌మెన్’. వి. శ్రీకాంత్, అజయ్ మైసూర్, వి. హెచ్. రావు నిర్మించిన ఈ మూవీకి కమ్రాన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకి ఉదయ్ గుర్రాల కెమెరామెన్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేశారు. ఈ మూవీ జూలై 3 నుంచి సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈక్రమంలో మంగళవారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి పద్మశ్రీ డా. బ్రహ్మానందం, నందినీ రెడ్డి, అద్దంకి దయాకర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. బ్రహ్మానందం మాట్లాడుతూ .. ‘‘హ్యాంగ్‌మెన్’ అనే టైటిల్ చూసి ఈ ఈవెంట్‌కు రావాలని నిర్ణయించుకున్నాను. దీన్ని…

Read more

మహేష్ బాబు గారు ‘రావు బహదూర్’ చూసి ‘మునుపెన్నడూ చూడని సినిమా’ అని చెప్పడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది: హీరో సత్యదేవ్

సూపర్ స్టార్ మహేష్ బాబు పవర్ ఫుల్ వాయిస్ తో సత్యదేవ్, వెంకటేష్ మహా, ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ మోస్ట్ అవైటెడ్ సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్' మోర్ దాన్ ఏ టీజర్" రిలీజ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకటేష్ మహా కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్'. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, వినూత్న ప్రచార కార్యక్రమాలు, పలువురు ప్రముఖుల ప్రశంసలతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై, ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల…

Read more

‘ఓ..! సుకుమారి’ జూలై 17న గ్రాండ్ రిలీజ్

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేజ్ ఎంటర్టైనర్ 'ఓ.! సుకుమారి'తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా 'శివం భజే' తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్, సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జూలై 17న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో హీరో, హీరోయిన్ ఒకరినొకరు తాకబోతున్న క్షణాన్ని మెరుపులతో విజువల్‌గా చూపించిన తీరు సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది. ట్యాలెంటెడ్…

Read more

“హైలెస్సో” నుంచి లైలం బాబుగా శివాజీ పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

సుడిగాలి సుధీర్ గా అందరికీ సుపరిచితుడైన సుధీర్ ఆనంద్ హీరోగా ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న చిత్రం హైలెస్సో. వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ఇది వారి బ్యానర్‌కు ప్రొడక్షన్ నంబర్ 1, సుధీర్ ఆనంద్‌కు హీరోగా ఐదవ చిత్రం. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో కోర్ట్ సినిమాలో తన ఇంటెన్స్ నటనతో ఆకట్టుకున్న శివాజీ లైలం బాబు' అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. శివాజీ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పోస్టర్‌లో నల్లటి దుస్తులు, పంచెకట్టుతో రాతి సింహాసనంపై కూర్చొని, చేతిలో సీసా పట్టుకుని శివాజీ కనిపించిన తీరు ఆయన పాత్రలోని…

Read more

డెలివరీ బాయ్ తో గొడవ వివాదంపై వివరణ ఇచ్చిన యువ హీరో అఖిల్ రాజ్ ఉడ్డెమారి

రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో అఖిల్ రాజ్ ఉడ్డెమారి ఓ డెలివరీ బాయ్ మధ్య జరిగిన గొడవ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వివాదంపై వివరణ ఇచ్చారు హీరో అఖిల్ రాజ్. తప్పుడు అడ్రస్ కు ఫుడ్ డెలివరీ చేయడమే కాకుండా తన కుటుంబ సభ్యులు, తల్లిని దూషించినందుకే అతన్ని తాను మందలించానని అఖిల్ రాజ్ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను అఖిల్ రాజు రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అఖిల్ రాజ్ స్పందిస్తూ - ఆ రోజు మా ఇంట్లో ఎవరూ ఫుడ్ ఆర్డర్ చేయలేదు. అయినా ఫుడ్ పార్శిల్ వచ్చింది. మా అమ్మ ఆ పార్శిల్ తీసుకుని, ఎవరు ఆర్డర్…

Read more