“రామభద్రుడు” సినిమా హైదరాబాద్ ఆడిషన్స్ సూపర్ సక్సెస్, ఈ నెల 28, 29 తేదీల్లో నెల్లూరులో జరగనున్న ఆడిషన్స్
"యంగ్ అండ్ డైనమిక్", "మా రాముడు అందరివాడు" వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డైనమిక్ హీరో శ్రీరామ్ నటిస్తున్న కొత్త సినిమా "రామభద్రుడు". శ్రీరామ్ హీరోగా నటిస్తున్న ఈ 14వ సినిమా నుంచి ప్రతిభ గల కొత్త నటీనటులకు ఆహ్వానం పలుకుతూ కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేశారు. ఈ ఆడిషన్స్ కు భారీ స్పందన లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఔత్సాహిక నటీనటులు దాదాపు 500 మంది ఈ ఆడిషన్స్ లో పాల్గొన్నారు. వీరిలో సెలెక్ట్ అయిన వారితో దర్శక నిర్మాతలు అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నారు. ఇక నెల్లూరులో ఈ సినిమా ఆడిషన్స్ నిర్వహించబోతున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో అభిరామ్ హోటల్ లో ఉదయం 9…
