Skip to content

అడ్వకేట్ నాగేశ్వర్ రావుకి లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గౌరవం

ప్రపంచంలోనే తొలి ‘సైలాజిస్ట్‌’గా గుర్తింపు హైదరాబాద్, ఆగస్టు 19, 2026: ప్రముఖ న్యాయ నిపుణులు, దిశా లా ఫర్మ్ వ్యవస్థాపకులు, సీఈఓ అడ్వకేట్ నాగేశ్వర్ రావు పూజారికి ప్రతిష్ఠాత్మక లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. దేశీయ వివాదాల పరిష్కారం, ముఖ్యంగా వైవాహిక మరియు కుటుంబ వివాదాల పరిష్కారంలో చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా ఆయనను *ప్రపంచంలోనే తొలి ‘సైలాజిస్ట్‌’ (Psylawgist)*గా, భారతదేశ ప్రముఖ మ్యాట్రిమోనియల్ లీగల్ నిపుణుడిగా గుర్తిస్తూ సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్‌ను అందించారు. 14 ఏళ్లుగా న్యాయ రంగంలో సేవలందిస్తున్న అడ్వకేట్ నాగేశ్వర్ రావు పూజారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని వివిధ కోర్టుల్లో 5,160 విడాకుల కేసులను దాఖలు చేసి, పరిష్కరించినట్లు…

Read more

‘ముగ్గురు కోతులు’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ముగ్గురు కోతులు’. ఈ మూవీలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ముఖ్య పాత్రల్ని పోషిస్తుండగా.. వర్షిక పాశం హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఇక ఈ టైటిల్‌కి తగ్గట్టుగా ముగ్గురు హీరోల పాత్రల్ని చూపిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ముగ్గురు హీరోలు రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ పెట్టి కనిపిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం జనాల్లో క్యూరియాసిటీని…

Read more

జయహో జనార్ధన ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్

పెద్ది సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన బుచ్చిబాబు గారు జయహో జనార్ధన సినిమా లోని హై ఎనర్జిటిక్ సాంగ్ ఆయన ' చిందువేయవే చాందుక తుకడ ' అనే సాంగ్ ను రిలీజ్ చేయడం జరిగింది.. నేషనల్ అవార్డ్ విన్నర్ సుద్దాల అశోక్ తేజ గారు స్వరపరిచిన ఈ పాట ను నాని మూవీ ప్యారడైజ్ లో సూపర్ సూపర్ హిట్ అయిన ఆయా షేర్ అనే పాట పాడిన జంగి రెడ్డి ఆలపించడం జరిగింది.. ఫీమేల్ వెర్షన్ ను మోహనా భోగరాజు పాడారు...వినగానే హమ్ చేయాలి అనిపించే ఈ పాటకు మరియు సినిమాకు అద్భుతమైన సంగీతాన్నీ చరణ్ అర్జున్ అందించారు. పానుగంటి ప్రొడక్షన్స్ పతాకంపై పానుగంటి శరత్ రెడ్డి…

Read more

‘ఇట్లు అర్జున’ అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్

స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. ఈ సినిమాతో అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, డెబ్యూ దర్శకుడు మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్, ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, ఇతర ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘ఇట్లు అర్జున’ అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో అనీష్ స్టైలిష్ లుక్‌లో ఓ భవనం పైకప్పు నుంచి దూకుతూ ఏదో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుండగా,…

Read more

‘ఇరుముడి’ సినిమాను తప్పకుండా ఇష్టపడతారు: బేబీ నక్షత్ర

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఇరుముడి'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్, ట్రైలర్, పాటలతో ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తించింది. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎమోషన్స్, యాక్షన్‌తో కూడిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన బేబీ నక్షత్ర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. -నా పేరు నక్షత్ర. మాది కేరళ. నేను ఏడో క్లాస్ చదువుకుంటున్నాను. ఇప్పటివరకు కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో కలిపి ఆరు సినిమాలు చేశాను. ‘ఇరుముడి’ అవకాశం ఎలా వచ్చింది? -దర్శకుడు…

Read more

‘రంభ ఊర్వశి మేనక’ నుంచి ‘బ్యాడ్ టైం బ్యాండ్ బాజా’ సాంగ్ రిలీజ్

కామెడీ సినిమాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ మరోసారి తనకు బాగా కలిసొచ్చిన జానర్‌లో సందడి చేయబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘నా కంటి మీద కనులే’, టీజర్‌ సినిమా పై అంచనాలు పెంచాయి. తాజాగా బ్యాడ్ టైం బ్యాండ్ బాజా సాంగ్ రిలీజ్ చేశారు. ‘బ్యాడ్ టైం బ్యాండ్ బాజా’ పేరుకు తగ్గట్టుగానే పాట ఆద్యంతం ఫుల్ ఎనర్జీ, ఫన్‌తో సాగుతుంది. హీరో జీవితంలో ఎదురయ్యే బ్యాడ్…

Read more

ఆగ‌స్ట్ 23 నుంచి తొలి త‌మిళ ఐడిల్ ఆడిష‌న్స్ ప్రారంభం

సూపర్ జడ్జ్ ఎ.ఆర్. రెహమాన్‌ ప్రకటనతో తొలి ‘తమిళ్ ఐడల్‌’ ఆడిషన్స్‌కు శ్రీకారం చుట్టిన ‘సోనీ విళా’, ‘సోనీ లివ్‌’ సంయుక్తంగా తమిళనాడులో తదుపరి సింగింగ్ సెన్సేషన్ కోసం అతిపెద్ద ప్రతిభాన్వేషణకు అడుగులు వేయ‌టం ప్రారంభించింది. ఈ క్ర‌మంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. తమిళనాడులో తదుపరి సంగీత సంచలనాన్ని వెలికితీసేందుకు నిర్వహిస్తోన్న‌ అతిపెద్ద ప్రతిభాన్వేషణకు చెన్నై వేదిక కానుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ‘తమిళ్ ఐడల్‌’ తొలి ఆడిషన్స్‌ ఆగ‌స్టు 23న ప్రారంభం కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ జ‌ర్నీలో భాగంగా సూపర్ జడ్జ్ ఎ.ఆర్. రెహమాన్‌ ప్రకటించిన ‘తమిళ్ ఐడల్‌’.. తమిళనాడులోని యువ, ఔత్సాహిక గాయకులను తమ ప్రతిభను చాటుకుని, జీవితంలో మరచిపోలేని అద్భుతమైన సంగీత ప్రయాణానికి తొలి…

Read more

‘రంభ ఊర్వశి మేనక’ ఫుల్ లెంత్ ఎంటర్ టైనర్: దర్శకుడు చంద్ర మోహన్ చింతాడ

అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘నా కంటి మీద కనులే’ పాట, టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చంద్ర మోహన్ చింతాడ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘రంభ ఊర్వశి మేనక’ టైటిల్ చాలా గమ్మత్తుగా ఉంది. ఈ టైటిల్ వెనుక ఉన్న కథ ఏమిటి? -సక్సెస్ కోసం ప్రతి ఒక్కరం చాలా ఆత్రుతగా…

Read more

‘జననాయకుడు ’ జీ5లో ఆగ‌స్ట్ 21 నుంచి స్ట్రీమింగ్‌

తమిళ్ జీ5లో ప్లాట్‌ఫామ్‌లోని అత్యంత ఆసక్తికరమైన బహుభాషా కంటెంట్‌, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్లాక్‌బస్టర్‌ ‘జననాయకుడు(జ‌న‌నాయ‌గ‌న్‌)’ కి గుర్తింపు ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించిన తమిళ్ ZEE5 కంటెంట్ స్లాట్‌లో నుంచి కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. ఈ క్ర‌మంలో అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న‌ ‘జననాయకుడు(జ‌ననాయ‌గ‌న్‌)’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. హెచ్. వినోద్‌ దర్శకత్వంలో, త‌మిళ‌నాడు గౌరవనీయులైన సీఎం సి.జోసెఫ్ విజయ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఆగ‌స్టు 21న తమిళ్ ZEE5లో ప్రీమియర్‌ కానుంది. ఇది తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. దీంతో దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రధాన భాషల ప్రేక్షకులను ఈ ప్రతిష్ఠాత్మక సినిమా అలరించనుంది. ‘జననాయకుడు’ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాగానే కాకుండా…

Read more

కీరవాణి గారి లేథోవిస్ మ్యూజిక్ లేబుల్ నుండి రానున్న మరొక సంచలన గీతం – ఈ నెల 28న విడుదల

ఇండిపెండెంట్ ఆర్టిస్టులను ప్రోత్సహించే తరుణంలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారు ఇటీవల లేథోవిస్ అనే మ్యూజిక్ లేబుల్ ప్రారంభించడం జరిగింది. ఈ లేబుల్ ద్వారా ఇప్పటికే నాలుగు పాటలు ఆ పాటలు మ్యూజిక్ లవర్స్ నుండి అద్భుతమైన ఆదరణను పొందాయి. కొన్ని నెలల క్రితం ఏర్పాటు చేసిన ఈ లేబుల్ ద్వారా వచ్చిన తొలి గీతం ముమ్ముకుస్సు వివిధ భాషలలో రావడంతో ప్రత్యేక ఆదరణ లభించింది. ఆ తర్వాత వచ్చిన రాసింది కీరవాణి కూసింది చంద్రబోస్ అంటూ సాగే పాటకు గాయని లిప్సిక తన గాత్రం అందించారు. ఆ తరువాత వచ్చిన రాహుల్ సిప్లిగన్జ్ సర్పంచ్ కూతురు వైరల్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఈ లేబుల్ నుండి వచ్చిన…

Read more