ఎన్టీఆర్ కు మద్దతుగా నిలిచిన విజయ్ దేవరకొండ, మానవీయ విలువల్లో మనం పూర్తిగా దిగజారిపోతున్నామంటూ పోస్ట్
ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలోని చుట్టమల్లే పాటను ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ తో మహిళల్ని కించపరిచేలా రూపొందించిన ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ ఘటనపై హీరో ఎన్టీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన ఆగ్రహాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఎన్టీఆర్ కు మద్ధతుగా నిలబడేందుకు ముందుకొచ్చారు విజయ్ దేవరకొండ. మానవీయ విలువల్లో మనం పూర్తిగా దిగజారిపోయామంటూ ఆయన ట్వీట్ చేశారు. హీరో విజయ్ దేవరకొండ స్పందిస్తూ - విలువల పరంగా మనం నీచమైన స్థాయికి దిగజారిపోతున్నాం. ఈ ఘటనకు బాధ్యుతలైన వారిని వదిలిపెట్టకూడదు. చట్టపరంగా వారిని కఠినంగా శిక్షించాలి. మరొకరు ఇలాంటి తప్పు చేయకుండా గుణపాఠం నేర్పాలి. పిల్లల్ని ఎలా పెంచుతున్నాం, మనం…
