ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ‘పురుష: ఉంటుంది – నిర్మాత బత్తుల కోటేశ్వరరావు
కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’. ఈ మూవీతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను మే 22న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత బత్తుల కోటేశ్వరరావు మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే.. మీ నేపథ్యం గురించి చెప్పండి? నా పేరు బత్తుల కోటేశ్వరరావు. మాది గుంటూరు జిల్లాలోని కారంపూడి. నాకు సినిమా ఫీల్డుతో ఎలాంటి సంబంధం లేదు. కానీ…
