మే 21న ఘనంగా ‘ChiruBobby2 / Chiru158’ ప్రారంభం
మెగాస్టార్ చిరంజీవి మరోసారి సక్సెస్‌ఫుల్ దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలుపుతున్నారు. ప్రతిష్టాత్మక KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ #ChiruBobby2 / #Chiru158 మే 21న ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ ప్రకటనను చిరంజీవి స్వయంగా ఒక పవర్‌ఫుల్ జిమ్ వీడియో ద్వారా రివిల్ చేశారు. ఆ వీడియోలో ఆయన చూపించిన డెడికేషన్, ఇంటెన్స్ వర్కౌట్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కొత్త లుక్ కోసం ఆయన పడుతున్న కష్టం, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం చేస్తున్న ట్రైనింగ్ ఈ సినిమాలో ఉండబోయే హై-వోల్టేజ్ యాక్షన్‌కు హింట్ ఇస్తోంది. వీడియోలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... గెట్టింగ్ రెడీ ఫర్ 158.. బాబీ.. మే 21…
