‘పెద్ది’ జర్నీ ఎమోషనల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది: ఫైట్ మాస్టర్ నబాకాంత్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్ నబాకాంత్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీ నేపథ్యం గురించి చెప్పండి? మాది మణిపూర్. అయితే నా చిన్నప్పుడే హైదరాబాద్ వచ్చేశాం. ఇక్కడే పెరిగాను. నాన్నగారి ఇన్‌స్పిరేషన్‌తో నేను ఇదే ఫీల్డ్‌లో 14 ఏళ్ల వయసు నుంచి…
