CASTE మూవీ నుంచి నాగబాబు లుక్ రిలీజ్
వరుణ్ సందేశ్, గగన్, సత్యం రాజేష్, రవి ప్రధాన పాత్రల్లో ఎకె జంపన్న రచన & దర్శకత్వంలో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘CASTE’. ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో నాగబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్రని రంగరాజన్ గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. నల్ల దుస్తుల్లో, మెడలో రుద్రాక్షమాల, నుదుటిపై తిలకం ధరించి, ఇంటెన్స్ గా చూస్తున్న నాగబాబు లుక్ పవర్ ఫుల్ గా వుంది. ఈ గెటప్ ఆయన పాత్రలోని కమాండ్, అథారిటీ చూపిస్తోంది. ఇందులో ఆయన పాత్ర నిర్భయంగా, కులాలకు అతీతమైన మానవత్వంతో ఉండబోతుంది…
