Skip to content

జీ5లో ‘బ్యాండ్ మేళం’.. ఏప్రిల్ 24 నుంచి స్ట్రీమింగ్

జీ5లో  ‘బ్యాండ్ మేళం’.. ఏప్రిల్ 24 నుంచి స్ట్రీమింగ్ Telugu News

వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోన్న టాప్ ఓటీటీ మాధ్య‌మం జీ5 త్వ‌ర‌లోనే మ‌రో క్రేజీ మూవీతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి సిద్ధ‌మైంది. ఆ సినిమాయే ‘బ్యాండ్ మేళం’. ఏప్రిల్ 24 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ బ్యాన‌ర్‌పై కావ్య కోన‌, శ్రావ్య కోన నిర్మించిన ఈ చిత్రానికి స‌తీష్ జ‌వ్వాజి ద‌ర్శ‌కుడు. కోర్ట్ చిత్రంతో మెప్పించిన హ‌ర్ష్ రోష‌న్‌, శ్రీదేవి అప‌ల్ల‌ జంట ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా న‌టించారు.
‘బ్యాండ్ మేళం’ సినిమాను అంద‌మైన గ్రామీణ నేప‌థ్య చిత్రంగా రూపొందించారు. చిన్న‌నాటి నుంచి గిరి(హ‌ర్ష్ రోష‌న్‌), రాజి(శ్రీదేవి అప‌ల్ల‌) స్నేహంతో క‌లిసి పెరుగుతారు. క్ర‌మంగా వారి మ‌ధ్య స్నేహం ప్రేమ‌గా మారుతుంది. కొన్ని ప‌రిస్థితుల్లో గిరి ఓ లోక‌ల్ మ్యూజికల్ బ్యాండ్‌ను ప్రారంభిస్తాడు. ఈ క‌థ‌లో సంస్కృతి, సంప్ర‌దాయం, సంగీతం వంటి అంశాల‌ను క‌ల‌గ‌లిపి మారుతున్న సామాజిక ప‌రిస్థితుల్లో ప్రేమ‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌య్యాయ‌నే విష‌యాన్ని హృద్యంగా చూపించారు.
మట్టివాసనతో కూడిన కథనం, హృదయాన్ని తాకే భావోద్వేగాలతో ‘బ్యాండ్ మేళం’ సినిమా ప్రాంతీయ కథలను ఆవిష్కరించే జీ5 తెలుగు ఒరిజినల్స్, ప్రీమియర్ల జాబితాలో మరో చ‌క్క‌టి చిత్రంగా చేరుతోంది.
ఈ సంద‌ర్భంగా హర్ష్ రోషన్ మాట్లాడుతూ “బ్యాండ్ మేళం ఒక సింపుల్‌గా క‌నిపించే ప్రభావవంతమైన ప్రేమకథ. ఇది ప్రేక్ష‌కుల‌కు మంచి అనుభూతినిస్తుంది. గిరి ప్రయాణం లోతైన భావోద్వేగాలతో, గ్రామీణ జీవనానికి దగ్గరగా ఉంటుంది. ఇలాంటి సినిమా జీ5 ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది” అన్నారు.
శ్రీదేవి అపల్ల మాట్లాడుతూ “బ్యాండ్ మేళం చిత్రంలో నేను చేసిన రాజి పాత్రలో ఆప్యాయత, అమాయకత్వం, ధైర్యం అన్నీ క‌నిపిస్తాయి. అలాగే కథలోని భావోద్వేగాలు అంద‌రికీ తమ జీవితంతో అనుసంధానం అవుతాయి. జీలో స్ట్రీమింగ్ కావడం వల్ల ‘బ్యాండ్ మేళం’ వివిధ ప్రాంతాల ప్రేక్షకులకు మ‌రింత చేరువ అవుతుందన‌టంలో సందేహం లేదు’ అన్నారు.
ఏప్రిల్ 24 నుంచి తెలుగు ZEE5లో ‘బ్యాండ్ మేళం’ను తప్పక

See also  అక్టోబర్ 10న రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన ‘శశివదనే’ భారీ ఎత్తున విడుదల

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.