Skip to content

డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా ‘నిలవే’ నిలిచింది: దర్శకులు వి.సముద్ర

‘నిలవే’ నేటి జనరేషన్ ‘గీతాంజలి’ : సక్సెస్ సెలబ్రేషన్స్‌లో నటుడు జెమిని సురేష్​ మా ‘‘నిలవే” మాకు ‘‘బాహుబలి”లాంటిది : సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరో సౌమిత్ పోలాడి సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ హీరోయిన్ గా నటించగా, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జంటగా నటించారు. POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మించారు. ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా అందరి ఆదరణ అందుకుంది. ఈ సందర్భంగా మంగళవారం రామానాయుడు…

Read more

‘హే బల్‌వంత్‌’ లాంటి సినిమా కోసం ఎదురుచూశాను: సుహాస్‌

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే బల్‌వంత్‌' ( హే భగవాన్‌ చిత్రం టైటిల్‌ మార్పు) అనే ఫుల్‌లెంగ్త్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో సుహాస్‌ మంగళవారం పాత్రికేయులతో ముచ్చటించారు…

Read more

3 రోజుల్లో వరల్డ్ వైడ్ 5.42 కోట్ల వసూళ్లు దక్కించుకున్న “కపుల్ ఫ్రెండ్లీ”

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ హార్ట్ టచింగ్ ప్రేమ కథ మూడు రోజుల్లోనే 5.42 కోట్ల రూపాయల వసూళ్లను దక్కించుకుంది. ఈ సినిమాకు రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ వంటి స్టార్స్ ప్రశంసలు అందిస్తున్నారు. మూవీ టీం చేస్తున్న ప్రమోషనల్ టూర్ కూడా ప్రేక్షకుల్లోకి సినిమాను బాగా తీసుకెళ్తోంది. "కపుల్ ఫ్రెండ్లీ" చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం…

Read more

చేతికి పట్టీ… ఎలాంటి ఆందోళన అవసరం లేదు – చిరంజీవి

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేతికి పట్టీతో కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు చక్కర్లు కొట్టగా, ఆయనకు ఏమైనా గాయమైయిందా? రాబోయే ప్రాజెక్టులపై ప్రభావం ఉంటుందా? అనే చర్చలు మొదలయ్యాయి. అయితే రూమర్స్ కి తావులేకుండా చిరంజీవి స్వయంగా ఎక్స్‌ (X) వేదికగా స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు. ఎలాంటి పెద్ద ఆరోగ్య సమస్య లేదని, కేవలం చిన్నపాటి షోల్డర్ కీహోల్ సర్జరీ మాత్రమే జరిగిందని స్పష్టం చేశారు మెగాస్టార్. ఇది ముందస్తు జాగ్రత్తగా చేసిన సాధారణ ప్రక్రియ అని, ప్రస్తుతం తాను సాఫీగా కోలుకుంటున్నానని, సర్జరీను విజయవంతంగా నిర్వహించిన ప్రముఖ ఆర్థ్రోస్కోపీ నిపుణుడు డా. నితిన్‌కు ధన్యవాదాలు తెలిపారు. “చేతికి పట్టీ ఉండటం గమనించి అభిమానులు, శ్రేయోభిలాషులు నా…

Read more

‘సెయాన్’ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

వర్సటైల్ స్టార్ శివకార్తికేయన్, దర్శకుడు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో, కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న కొత్త చిత్రం కోసం చేతులు కలిపారు. బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన అమరన్ తర్వాత శివకార్తికేయన్ మరోసారి రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌తో కొలాబరేట్ కావడం విశేషం. విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని అందుకున్న ఆ చిత్రంతో ఏర్పడిన క్రియేటివ్ జర్నీ ఇప్పుడు మరింత బలపడింది. గ్రాండ్ రూరల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “సెయాన్” అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేశారు. 2026లో బిగ్గెస్ట్ ఫ్యామిలీ స్పెక్టకిల్‌గా నిలిచేలా ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్, వినోదాన్ని మేళవిస్తూ ఈ సినిమా రూపొందుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శివకార్తికేయన్ డివైన్ ల్లూక్ కనిపిస్తున్నారు. ధోతి, విభూతి, రుద్రాక్షలతో…

Read more

టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్

దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “నాగబంధం” పాన్-ఇండియా స్థాయిలో భారీ సంచలనం సృష్టిస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ మిస్టికల్ ఎపిక్ టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. కేవలం 24 గంటల్లోనే 20 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించి, దేశవ్యాప్తంగా ట్రెండింగ్ చార్ట్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకోవడం ద్వారా పాన్-ఇండియన్ లో అదరగొట్టింది. ఈ అచీవ్మెంట్ ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టేది డైరెక్టర్ అభిషేక్ నామా విజన్. అంతర్జాతీయ స్థాయి విజువల్ స్పెక్టకిల్‌ను అందించారు. ఆయనతో పాటు హీరో విరాట్ కర్ణా, డెబ్యుటెంట్ నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి కలిసి వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. టీజర్‌లో ప్రత్యేక హైలెట్ గా నిలిచింది విరాట్ కర్ణా…

Read more

కాటాలన్ ఫస్ట్ సింగిల్ మజాకో మల్లికా రిలీజ్

క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన గ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్ కాటాలన్ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. పుష్ప, జైలర్ వంటి చిత్రాల ద్వారా ఇప్పటికే మలయాళీ ప్రేక్షకులకు సుపరిచితుడైన తెలుగు స్టార్ సునీల్ ఈ ట్రాక్ లో అదరగొట్టారు. ఐటెం నంబర్‌గా వహ్చిన ఈ పాటలో సునీల్ హై-ఎనర్జీ డ్యాన్స్ మూమెంట్స్ హైలైట్ గా నిలిచాయి. బి. అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచిన *“మజాకో మల్లికా అనే ట్రాక్‌ను వినాయక్ శశికుమార్ రాశారు. ఆనంద్ శ్రీరాజ్, భద్ర పాడారు. ఇది మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో విడుదలైంది. కాటాలన్ మే 14న భారీ పాన్-ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది. బ్లాక్‌బస్టర్ మార్కో మేకర్స్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి కొత్త…

Read more

“కపుల్ ఫ్రెండ్లీ” మూవీపై సిద్ధు జొన్నలగడ్డ ప్రశంసలు

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన "కపుల్ ఫ్రెండ్లీ" మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. "కపుల్ ఫ్రెండ్లీ" సినిమాకు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నారని, ఇది మనసుకు హత్తుకునే ప్రేమ కథా చిత్రమని తన పోస్ట్ లో సిద్ధు పేర్కొన్నారు. హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ మానస వారణాసితో పాటు ఇతర టీమ్ మెంబర్స్ అందరికీ తన శుభాకాంక్షలు తెలిపారు. కపుల్ ఫ్రెండ్లీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు…

Read more

“కపుల్ ఫ్రెండ్లీ” సినిమా 2 రోజుల్లో 3.96 కోట్ల వసూళ్లు

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన "కపుల్ ఫ్రెండ్లీ" సినిమా రీసెంట్ గా థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు 2 రోజుల్లో వరల్డ్ వైడ్ 3.96 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రావడం విశేషం. హార్ట్ టచింగ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన "కపుల్ ఫ్రెండ్లీ" మూవీ అందరి ప్రశంసలతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. "కపుల్ ఫ్రెండ్లీ" చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్…

Read more

‘తు యా మైన్’ చిత్రంపై దర్శకుడు మణిరత్నం ప్రశంసల జల్లు

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు బిజోయ్ నంబియార్ తెరకెక్కించిన సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం 'తు యా మైన్' ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి విశేష స్పందనను రాబడుతోంది. శనయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, తనదైన ఉత్కంఠభరితమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా దక్షిణాదిలో నిర్వహించిన ఓ ప్రత్యేక స్క్రీనింగ్ లో భారతీయ చలనచిత్ర దిగ్గజం మణిరత్నం ఈ చిత్రాన్ని వీక్షించి, చిత్రబృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. "బిజోయ్ నంబియార్ ఈ చిత్రంలో ఒక కైనెటిక్ ఎనర్జీని తీసుకువచ్చారు. ఇది థియేటర్లలో, ప్రేక్షకుల మధ్య కూర్చొని పెద్ద తెరపై చూసినప్పుడే ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించగలం," అని ప్రశంసించారు. ప్రత్యేక…

Read more