తానా సత్కారం పొందిన ప్రముఖ కరాటే మాస్టర్ లక్ష్మీ సామ్రాజ్యంను నంది అవార్డ్ తో సత్కరించిన టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) నుంచి సత్కారం పొందిన ప్రముఖ కరాటే మాస్టర్ లక్ష్మీ సామ్రాజ్యంను ఘనంగా సత్కరించారు తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ సన్మాన కార్యక్రమంలో ప్రముఖ నటులు సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కరాటే అసోసియేషన్ నుంచి స్వామి రెడ్డి, గౌరీ శంకర్, స్నిగ్ధ, చంద్రకాంత్, సక్సెల్ లైఫ్, దుబాయ్ స్థాపకులు యోగ నారాయణ, కరాటే మాస్టర్ రవి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ - మన లక్ష్మీ గారికి తానాలో ఘన సన్మానం జరగడం మనందరికీ గర్వకారణం. తానాలో సత్కారం పొందిన లక్ష్మీ గారిని…