Skip to content

#ChiruBobby2 అనౌన్స్‌మెంట్

బ్లాక్‌బస్టర్ కాంబో మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి రీయూనియన్‌కి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ రోజు మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా అనౌన్స్ చేశారు. ప్రతిష్టాత్మక KVN సంస్థ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మించనుంది. మెగాస్టార్ వింటేజ్ మాస్ స్పెక్టాకిల్‌తో రికార్డులు బద్దలు కొట్టిన వాల్తేరు వీరయ్య తర్వాత ఇది మరో సెన్సేషనల్ కాంబినేషన్‌గా నిలవనుంది. చిరంజీవి లార్జర్-దెన్-లైఫ్ పర్సోనాను అద్భుతంగా స్క్రీన్‌పై చూపించగల డైరెక్టర్‌గా పేరొందిన బాబీ, ఈసారి రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్‌తోనే మ్యాసీవ్ ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేశారు. గోడను బలంగా కొడుతున్న గొడ్డలి, దాని క్రింద “The blade that set the bloody benchmark” అనే ట్యాగ్‌లైన్ రాబోయే సినిమా ఎంత…

Read more

“మన శంకరవరప్రసాద్ గారు” మీ అందరి అంచనాలని అందుకుంటుంది: డైరెక్టర్ అనిల్ రావిపూడి

-మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ మూవీ టైటిల్ "మన శంకరవరప్రసాద్ గారు", మాస్ హిస్టీరియా గ్లింప్స్ లాంచ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. #Mega157, #ChiruAnil వర్కింగ్ టైటిల్స్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన గర్వంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి "మన శంకరవరప్రసాద్ గారు" అనే టైటిల్ పెట్టారు. "పండగకి…

Read more

“త్రిశెంకినీ” టైటిల్ విడుదల

ఎన్. బి. జె. ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత ఎన్ బిక్కునాథ్ నాయక్ నిర్మిస్తున్న సినిమా "త్రిశెంకినీ". ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు రంజిత్ కుమార్. పలువురు నూతన నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ హాస్య నటుడు బాబు మోహన్ అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు బాబుమోహన్ మాట్లాడుతూ - మెగాస్టార్ చిరంజీవి అన్నగారి బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మెగాస్టార్ గారు మరిన్ని గొప్ప విజయాలు సాధించాలి, తన…

Read more

ఎఫ్ఎన్ సీసీలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు, మెగాస్టార్ ఫొటోస్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు

మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రొడ్యూసర్స్ అశ్వనీదత్, ఎఫ్ ఎన్ సీసీ అధ్యక్షులు కేఎస్ రామారావు, దర్శకుడు బి.గోపాల్, ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ మరియు ఫిలింనగర్ కల్చర్ సెంటర్ కమిటీ మెంబర్ కాజా సూర్యనారాయణ, నిర్మాత డా. కె. వెంకటేశ్వరరావు, జెమినీ కిరణ్, ఏడిద రాజా, ఎఫ్ఎన్ సీసీ సెక్రటరీ తుమ్మల రంగారావు, ట్రెజరర్ శైలజ, కమిటీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, ఏడిద రాజా బాలరాజు, వరప్రసాద్ తో పాటు ఏడి ద శ్రీరామ్, సురేష్ కొండేటి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పలు సూపర్ హిట్ చిత్రాల్లోని మెగాస్టార్ ఫొటోస్ తో కూడిన…

Read more

ప‌వ‌న్ కేస‌రి, కావ్యా క‌ళ్యాణ్ రామ్ జంటగా నూతన చిత్రం ప్రారంభం

టి.డి.ఆర్ సినిమాస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్.1 గా కుంచం శంకర్ దర్శకత్వంలో తలారి దినకరణ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు గురువారం (ఆగస్ట్ 21) నాడు ఘనంగా జరిగాయి. ముహుర్త‌పు స‌న్నివేశానికి రామ్ అబ్బ‌రాజు క్లాప్ నివ్వ‌గా, ప్ర‌శాంత్ కుమార్ దిమ్మెల కెమెరా స్విచాన్ చేసి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రామ్ అబ్బ‌రాజు, ప్ర‌శాంత్ దిమ్మెల‌, అడిదాల విజ‌య్‌పాల్ రెడ్డి స్క్రిప్ట్ అందించారు. ప‌వ‌న్ కేస‌రి, కావ్యా క‌ళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించనుండగా.. కెమెరామెన్‌గా సాయి పని చేయనున్నారు. ఇక ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా... * హీరో పవన్ కేసరి మాట్లాడుతూ* .. ‘నా బాల్య స్నేహితుడు సన్నీ…

Read more

‘బ్యాడ్ గాళ్స్’ నుంచి ‘ఇలా చూసుకుంటానే’ సాంగ్‌

నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ముఖ్య తారాగణం తో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మున్నా ధులిపూడి దర్శకత్వంలో వస్తున్న మరో ఎంటర్టైనర్ చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందిస్తుండగా మెలోడీ కింగ్ అనూప్ రూబెన్స్ తన చక్కని భాణీలతో ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్…

Read more

‘పరదా’లాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదు -అనుపమ పరమేశ్వరన్

సినిమా బండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల 'పరదా' అనే మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌ తో వస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘పరదా’ ఆగస్ట్ 22న థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. పరదా కథ విన్న తర్వాత…

Read more

‘విశ్వంభర’ మెగా బ్లాస్ట్ గ్లింప్స్ రిలీజ్

రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర టీమ్ అభిమానులకు స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సోషల్-ఫాంటసీ స్పెక్‌టకిల్‌కు సంబంధించిన గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ పతాకంపై విక్రం, వంశీ, ప్రమోద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేస్తూ ఎపిక్ టోన్ సెట్ చేసింది. ఓ బాబు, పెద్దాయన మధ్య జరిగే సంభాషణతో గ్లింప్స్‌ మొదలౌతుంది. విశ్వంభరలో జరిగిన పరిణామాల గురించి ఆ పెద్దాయన చెబుతాడు. ఒకరికి వచ్చిన స్వార్థం కారణంగా జరిగిన యుద్ధం… సమూహం ఎదురుచూసే రక్షకుడు ఎంట్రీ ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది. చిరంజీవి మాస్ లుక్‌లో, రక్షకుడిగా ఇచ్చిన పవర్‌ఫుల్…

Read more

ఇంట్రెస్టింగ్‌గా సోనీ లివ్‌ ఒరిజినల్ ‘ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్’ ట్రైలర్.. ఆగస్టు 29న స్ట్రీమింగ్

సోనీ లివ్‌లో ఈ ఏడాది రానున్న మలయాళీ ఒరిజినల్ సిరీస్‌ల్లో ‘ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్’ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. యదార్థ సంఘటనల ఆధారంగా, త్రివేండ్రం బ్యాక్ డ్రాప్‌లో తీసిన ఈ డార్క్ యాక్షన్ కామెడీ అందరినీ ఆకట్టుకునేందుకు ఆగస్ట్ 29న మలయాళం, తెలుగు, తమిళ్ & హింది లో రానుంది. ఈ మేరకు తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్’ అనే టైటిల్‌ను బట్టి చూస్తేనే కథ ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది. ఈ కథలో నలుగురు యువకులు, మురికివాడ నుండి వచ్చిన ఒక చిన్న పిల్లవాడు ఉంటారు. ఇక ఈ ఊర్లో ఆలయ ఉత్సవం జరిపి తమ గౌరవాన్ని పెంచుకోవాలని ఈ గ్యాంగ్ ప్రయత్నిస్తుంది. ఇక…

Read more

సినీ కార్మికుల చర్చలు సఫలం.. నేటి నుంచి షూటింగ్స్‌ షురూ!

టాలివుడ్‌ వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. లేబర్‌ కమిషనర్‌ మధ్య వర్తిత్వంతో నిర్మాతలకు, కార్మిక సంఘాల మధ్య గురువారం రాత్రి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ లోని లేబర్‌ కమిషనర్‌ కార్యాలయంలో నిర్వహించిన చర్చలు సఫలీకృతమయ్యాయి. దీంతో 18 రోజుల విరామానికి తెరపడినట్లైంది. కార్మికులంతా శుక్రవారం నుంచి యధావిధిగా షూటింగ్స్‌కు హాజరు కానున్నట్లు సినీ కార్మిక సంఘం ప్రతినిధులు ప్రకటించారు. ఫిలిం కార్పొరేషన్‌ డెవెవెలప్‌మెంట్‌ చైర్మన్‌ దిల్‌రాజు, అదనపు కమిషనర్‌ ఈ.గంగాధర్‌ ఆయా సంఘాల ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. రెమ్యునరేషన్‌ పెంచాలని కోరుతూ సినీ కార్మికులు గత కొంతకాలం గా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, సెక్రెటరీ దామోదర ప్రసాద్, డైరెక్టర్ తేజ, నిర్మాతలు స్రవంతి రవికిషోర్,…

Read more