24 గంటల్లో 101 మిలియన్+ వ్యూస్ తో హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేసిన ‘పెద్ది’ ట్రైలర్- యూట్యూబ్‌లో ఇండియా వైడ్ నెం.1 ట్రెండింగ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పెద్ది’ ట్రైలర్ విడుదలైన క్షణం నుంచే ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో వ్యూస్ సాధిస్తూ దూసుకెళ్తోంది. విడుదలైన తొలి 24 గంటల్లోనే ట్రైలర్ 100 మిలియన్ మార్క్‌ను దాటి 101 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ ఫీట్‌ను అత్యంత వేగంగా అందుకున్న తెలుగు ట్రైలర్‌గా కొత్త రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం పలు భాషల్లో యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టి ‘పెద్ది’పైనే ఉంది. ట్రైలర్ సాధించిన ఈ భారీ రికార్డులు సినిమాపై ఉన్న అంచనాలను మరింత బలపరిచాయి. తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు దీన్ని పండగలా సెలబ్రేట్ చేసుకుంటుండగా, హిందీతో పాటు ఇతర…
