సితార ఎంటర్టైన్మెంట్స్, రిషబ్ శెట్టి ఫిల్మ్స్ లో ‘మోటార్‌సైకిల్ డైరీస్’
గమ్యస్థానాలకు అతీతంగా సాగే ఓ భావోద్వేగ ప్రయాణం.. జ్ఞాపకాలు, అనుభూతులు, జీవితాన్ని మార్చే అనుభవాల సమాహారంగా ‘మోటార్‌సైకిల్ డైరీస్’ సితార ఎంటర్టైన్మెంట్స్, రిషబ్ శెట్టి ఫిల్మ్స్ సంయుక్తంగా ఓ ఆసక్తికరమైన కొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ‘మోటార్‌సైకిల్ డైరీస్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను రిషబ్ శెట్టి ప్రజెంట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రతి మైలురాయి ఓ జ్ఞాపకంగా, ప్రతి మలుపు ఓ కథగా మారేలా సాగే ఓ అందమైన ప్రయాణమే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తంగా ఉండబోతోంది. గమ్యస్థానాల కంటే ప్రయాణంలో ఎదురయ్యే అనుభవాలు, భావోద్వేగాలు, జీవితంలో మరిచిపోలేని సంఘటనలకు ప్రాధాన్యతనిస్తూ ఓ హృద్యమైన ట్రావెల్ ఫిల్మ్‌గా ఈ చిత్రాన్ని…
