కిరణ్ అబ్బవరం, దేవిక భట్, సుధాకర్ చాగంటి, జాయ్ ఫిల్మ్స్ ‘రియాలిటీ’ నుంచి వెడ్డింగ్ సీజన్…
సితార ఎంటర్టైన్మెంట్స్, రిషబ్ శెట్టి ఫిల్మ్స్ లో ‘మోటార్‌సైకిల్ డైరీస్’

గమ్యస్థానాలకు అతీతంగా సాగే ఓ భావోద్వేగ ప్రయాణం.. జ్ఞాపకాలు, అనుభూతులు, జీవితాన్ని మార్చే అనుభవాల సమాహారంగా ‘మోటార్‌సైకిల్ డైరీస్’
సితార ఎంటర్టైన్మెంట్స్, రిషబ్ శెట్టి ఫిల్మ్స్ సంయుక్తంగా ఓ ఆసక్తికరమైన కొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ‘మోటార్‌సైకిల్ డైరీస్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను రిషబ్ శెట్టి ప్రజెంట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ప్రతి మైలురాయి ఓ జ్ఞాపకంగా, ప్రతి మలుపు ఓ కథగా మారేలా సాగే ఓ అందమైన ప్రయాణమే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తంగా ఉండబోతోంది. గమ్యస్థానాల కంటే ప్రయాణంలో ఎదురయ్యే అనుభవాలు, భావోద్వేగాలు, జీవితంలో మరిచిపోలేని సంఘటనలకు ప్రాధాన్యతనిస్తూ ఓ హృద్యమైన ట్రావెల్ ఫిల్మ్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
శివా చిరంతన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, ప్రగతి రిషబ్ శెట్టి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, భువన్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, ధరణి గంగెపుత్ర ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించే సితార ఎంటర్టైన్మెంట్స్, రిషబ్ శెట్టి ఫిల్మ్స్ కలిసి చేస్తున్న ఈ వినూత్న ప్రయత్నం ‘మోటార్‌సైకిల్ డైరీస్’పై ఆసక్తిని పెంచుతోంది. ఓ ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రేక్షకులకు మరపురాని సినిమాటిక్ అనుభూతిగా అందించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.
త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్రంలోని నటీనటులు, ఇతర పూర్తి వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

