మిమ్మల్ని గౌరవించిన చిత్ర పరిశ్రమలను మీరు గౌరవించండి – ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్
ఇటీవల కొందరు నాయికలు తెలుగు చిత్ర పరిశ్రమను, దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీని విమర్శిస్తూ మాట్లాడుతుండటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక్కడే అవకాశాలు పొంది ఇదే పరిశ్రమలను కించపరిచేలా మాట్లాడుతున్న నాయికలను ఉద్దేశించి తనదైన శైలిలో పోస్ట్ చేశారు ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్. ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ స్పందిస్తూ - టాలీవుడ్ లో, సౌత్ ఇండియా సినీ పరిశ్రమలో అవకాశాలు పొంది, గుర్తింపు తెచ్చుకున్న కొందరు నాయికలు కొన్నేళ్ల తర్వాత ఇదే పరిశ్రమను విమర్శించడం తగదు. సదరు నాయికలు ఇక్కడి కథలు, సంప్రదాయాలను తప్పుగా పేర్కొంటున్నారు. ప్రతి యాక్టర్ కు తమ అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ ఉంటుంది. కానీ సద్విమర్శలు చేయకుండా మిమ్మల్ని ఆహ్వానించిన పరిశ్రమనే చిన్న చూపు చూసేలా మాట్లాడటం…
