Skip to content

#Chiru158 హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోన్న చిత్రీకరణ

‘వాల్తేరు వీరయ్య’ భారీ విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి మళ్లీ కలిసి పనిచేస్తున్న చిత్రం #ChiruBobby2 / #Chiru158. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో విస్తృతంగా జరుగుతోంది.

ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్లు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్న భారీ యాక్షన్ సన్నివేశం ఈ చిత్రంలో మేజర్ హైలెట్స్ లో ఒకటి. భారీ సంఖ్యలో ఫైటర్లతో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సన్నివేశం, మెగాస్టార్ చిరంజీవిని పవర్ ఫుల్ , డైనమిక్ అవతార్‌లో ప్రజెంట్ చేయనుంది. అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించేలా రూపొందుతున్న ఈ యాక్షన్ ఘట్టంలో, మెగాస్టార్ స్వయంగా పాల్గొంటూ చాలా సాహసోపేతమైన స్టంట్స్ చేస్తున్నారు.

అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ‘టైటిల్ టీజర్’ను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నద్ధమవుతోంది.

ఈ చిత్రానికి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. థమన్ ఎస్ సంగీతం సమకూరుస్తుండగా, ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ అద్భుతమైన విజువల్స్‌ అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్‌ను అవినాష్ కొల్లా నిర్వహిస్తుండగా, ఎడిటింగ్ ఆంటోనీ రూబెన్.

కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్ పోట్లూరి అడిషినల్ స్క్రీన్‌ప్లేను సమకూర్చారు. స్టార్ రచయితల ద్వయం భాను-నందు సంభాషణలు రాస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చిత్రాలలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, అనశ్వర రాజన్

సాంకేతిక సిబ్బంది:
రచన& దర్శకత్వం: బాబీ కొల్లి
నిర్మాత: వెంకట్ కె. నారాయణ
బ్యానర్: కెవిఎన్ ప్రొడక్షన్స్
సంగీతం: థమన్ ఎస్
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి
అడిషినల్ స్క్రీన్ ప్లే: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: ఆంటోనీ రూబెన్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
VFX సూపర్‌వైజర్: యుగంధర్ టి
డైలాగ్స్: భాను–నందు
క్రియేటివ్ ప్రొడ్యూసర్: లోహిత్ NK
Chief Co-Directors: బెల్లంకొండ సత్యం, పూసల రాధాకృష్ణ
కో-డైరెక్టర్: వి. క్రాంతి చక్రవర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శరణ్య పోట్ల
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.