ఫస్ట్ టైమ్ మూవీ రివ్యూ: విజువల్ వండర్‌గా ఆకట్టుకున్న సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ | Rating 3.75/5
హేమంత్ ఇప్పనపల్లి స్వీయ దర్శకత్వంలో, వైవిధ్యభరితమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సరికొత్త సైన్స్ ఫిక్షన్ రొమాన్స్ మిస్టరీ థ్రిల్లర్ "ఫస్ట్ టైమ్" (First Time). పరిమిత బడ్జెట్‌తోనే భారీ విజువల్స్, అద్భుతమైన VFX వండర్‌గా రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ట్రెండ్‌కు సవాల్ విసురుతూ, కేవలం “హ్యూమన్ ఇంటెలిజెన్స్”తోనే విజువల్ మ్యాజిక్ సృష్టించిన ఈ సినిమా రన్‌టైమ్ 1 గంట 48 నిమిషాలు. కథాంశం: ఈ సినిమా కథ పూర్తిగా సైన్స్, ఆధ్యాత్మికత (Spirituality), మరియు మానవ సంబంధాల చుట్టూ తిరుగుతుంది. భూమి ఆవిర్భవించిన తొలి క్షణాల్లో, అంటే “1-1-1” (మొదటి సంవత్సరం, మొదటి నెల, మొదటి రోజు) సమయంలో అసలు ఏం జరిగింది?…
